ICC Player of the Month Award : టీమిండియా స్టార్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న జింబాబ్వే ప్లేయర్..!
సెప్టెంబరు 2025 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్‌లు నామినేట్ అయ్యారు.
By - Medi Samrat |
సెప్టెంబరు 2025 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్‌లు నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గత నెలలో అద్భుత ప్రదర్శన చేసి ఎన్నో మ్యాచ్‌ల్లో విజయం సాధించారు.
భారత్ తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ గెలవడంలో అభిషేక్, కుల్దీప్‌లు కీలక పాత్రలు పోషించారు. అయితే బెన్నెట్ జింబాబ్వే T20 ప్రపంచ కప్ 2026కి అర్హత సాధించే విషయమై బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. తృటిలో జింబాబ్వే 2024 T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.
2025 ఆసియా కప్ కోసం అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. అభిషేక్ 7 ఇన్నింగ్స్‌లలో 314 పరుగులు చేశాడు. అతని సగటు 44.86 కాగా, స్ట్రైక్ రేట్ 200. ఇదే టోర్నమెంట్‌లో అత్యధికం. కాగా, కుల్దీప్ యాదవ్ బంతితో అద్భుతాలు చేసి 7 ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
మరోవైపు బ్రియాన్ బెన్నెట్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. బెన్నెట్ 9 T20 మ్యాచ్‌లలో 55.22 సగటు మరియు 165.66 స్ట్రైక్ రేట్‌తో 497 పరుగులు చేశాడు. అతడు క్వాలిఫయర్ మొదటి మూడు మ్యాచ్‌లలో 72, 65 మరియు 111 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది జింబాబ్వేకు ముఖ్యమైన విజయాన్ని అందించింది.
ఐసీసీ మహిళా క్రికెటర్లలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ పేర్లను కూడా ప్రకటించింది, భారత్‌కు చెందిన స్మృతి మంధాన, దక్షిణాఫ్రికాకు చెందిన తజమిన్ బ్రిట్స్, పాకిస్తాన్‌కు చెందిన సిద్రా అమీన్‌లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారు. గత నెలలో ముగ్గురూ అద్భుతంగా రాణించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మృతి మంధాన రెండు సెంచరీలు చేసింది. చివరి మ్యాచ్‌లో కేవలం 50 బంతుల్లో చేసిన రికార్డు సెంచరీ కూడా ఉంది.
సిద్రా అమీన్ మూడు మ్యాచ్‌ల్లో 293 పరుగులు చేసింది. ఆమె సగటు 293. సెప్టెంబరు నెలలో అమీన్ వరుసగా 121 నాటౌట్, 122, ఆపై హాఫ్ సెంచరీ ఇన్నింగ్సులు ఉన్నాయి.
తాజ్మిన్ బ్రిట్స్ కూడా గొప్ప ఫామ్‌ను కొనసాగించింది. సెప్టెంబరు నెలలో బ్రిట్స్ కేవలం రెండు ఇన్నింగ్స్‌లలో 272 పరుగులు చేసింది. ఇందులో 101 నాటౌట్ మరియు 171 నాటౌట్ ఇన్నింగ్స్ లు ఉన్నాయి.