ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను తాజాగా ప్రకటించింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గాయం కారణంగా ఆసీస్ టూర్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి రెండు స్థానాల మధ్య 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. బాబర్ అజమ్(837), రాస్ టేలర్(818), ఆరోన్ ఫించ్(791) పాయింట్లతో మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. స్టీవ్ స్మిత్ టాప్ 20లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో స్టీవ్ స్మిత్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా టాప్ 20లో చోటు సంపాదించాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి బ్యాటింగ్‌లో కెరీర్ బెస్ట్ చేరుకున్నాడు.
బౌలింగ్ విభాగానికి వస్తే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ బౌలర్ ముజీబుర్ రెహమాన్ 701 పాయింట్లతో రెండో స్థానం, జస్‌ప్రీత్ బుమ్రా 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్ 10లో బుమ్రా మినహా భారతజట్టు నుంచి ఒక్క బౌలర్ కూడా లేరు.