టెస్టు ఛాంపియ‌న్‌పై ఐసీసీ కీల‌క నిర్ణ‌యం..! భార‌త్‌పై ప్ర‌భావం ప‌డ‌నుందా..?

ICC On Test Championship. ఐసీసీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హిస్తున్న టెస్టు ఛాంపియ‌న్ పాయింట్ల ప‌ట్టిక‌లో

By Medi Samrat  Published on  16 Nov 2020 11:12 AM IST
టెస్టు ఛాంపియ‌న్‌పై ఐసీసీ కీల‌క నిర్ణ‌యం..! భార‌త్‌పై ప్ర‌భావం ప‌డ‌నుందా..?

ఐసీసీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హిస్తున్న టెస్టు ఛాంపియ‌న్ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ తొలి స్థానంలో కొన‌సాగుతోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పాయింట్ల ఆధారంగానే టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ను నిర్వ‌హించాల‌ని బావించిన ఐసీసీ తాజాగా ఆ ఆలోచ‌న‌ను మార్చుకుంటుంన్న‌ట్లు తెలుస్తోంది. పాయింట్ల ఆధారంగా కాకుండా విజ‌యాల శాతం ఆధారంగా ఫైన‌ల్‌కు జ‌ట్ల‌ను ఎంపిక చేయ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. సోమవారం నుంచి జ‌ర‌గ‌నున్న ఐసీసీ చివ‌రి త్రైమాసిక స‌మావేశంలో దీనిపై తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

క‌రోనా కార‌ణంగా టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లోని ప‌లు టెస్టు సిరీస్‌లు ర‌ద్దు అయ్యాయి. దీంతో ఆయా సిరీస్‌ల‌లో పాల్గొనే జ‌ట్ల‌కు స‌మానంగా పాయింట్లు పంచాల‌ని తొలుత ఐసీసీ బావించింది. అయితే.. ఇప్పుడు దానికి బ‌దులు విజ‌యాల శాతం ఆదారంగా ప్ర‌క్రియ‌ను కొన‌సాగించాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్నాయి.

ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉంది. ఒక‌వేళ విజ‌యాల శాతం ఆధారంగా అయితే టీమ్ఇండియా ప‌రిస్థితి ఏంటో ఓ సారి చూద్దాం. అంద‌రికంటే ఎక్కువ ఆస్ట్రేలియా అత్య‌ధిక విజ‌యాల శాతం క‌లిగి ఉంది. 82.22విజ‌య శాతంతో 296 పాయింట్లు గెలుచుకంది. భార‌త్ ఖాతాలో 360పాయింట్లు ఉండ‌గా.. విజ‌యాల శాతం 75. ఇంగ్లాండ్ ఖాతాలో 292 పాయింట్లు ఉండ‌గా విజ‌యాల‌శాతం 60.83. న్యూజిలాండ్ ఖా‌తాలో 180 పాయింట్లు ఉండ‌గా విజ‌యాల శాతం 50. పాకిస్థాన్ ఖ‌తాలో 166 పాయింట్లు ఉండ‌గా విజ‌యాల శాతం 39.52. విజయాల శాతం ఆధారంగా అయితే.. భార‌త్ రెండో స్థానంలో ఉంది. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేకున్నా.. భార‌త్ క‌ఠిన ప్ర‌త్య‌ర్థిల‌తో సిరీస్ ఆడాల్సి ఉంది. ఆసీస్‌తో దానిసొంత‌గ‌డ్డ‌పై, ఇంగ్లాండ్‌పై భార‌త్‌లో ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల్లో భార‌త్ రాణించేదానిపైనే ఫైన‌ల్ చేరుతుందా లేదా అనేది తెలుస్తుంది.

ఒక‌వేళ భార‌త్‌.. ఆసీస్ చేతిలో నాలుగు టెస్టుల్లో ఓట‌మిపాలై.. ఇంగ్లాండ్‌పై అయిదు టెస్టుల్లో విజ‌యం సాధిస్తే 480 పాయింట్లు భార‌త్ ఖాతాలో ఉంటాయి. గెలుపు శాతం 66.67శాతానికి చేరుకుంటుంది. ఒక‌వేళ ఆసీస్ చేతిలో 1-3తో ఓడి, ఇంగ్లాండ్ పై 5-0తో గెలిస్తే 510 పాయింట్లు, విజ‌యాల శాతం 70.83 అవుతుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా చేతిలో 0-2తో సిరీస్ కోల్పోయి , ఇంగ్లాండ్ పై 5-0తో గెలిస్తే 500 పాయింట్లు, 69.44 గెలుపు శాతంగా ఉంటుంది. ఇదే స‌మ‌యంలో కివీస్ గ‌నుక స్వ‌దేశంలో సిరీస్‌ల‌ను క్లీన్ స్వీప్ చేస్తే భార‌త్ అవ‌కాశాలు సంక్లిష్టం అవుతాయి. భార‌త్ పైన‌ల్ చేర‌డం అనేది ఇంగ్లాండ్‌, ఆసీస్ సిరీస్ ఫ‌లితాల పైనే ఆధార‌ప‌డి ఉంది.

ఐసీసీ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఎలా జ‌రుగుతుందే..?

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిది స్థానాల్లో ఉన్న ప్ర‌తి జ‌ట్టు రెండేళ్ల‌లో ఇంటా, బ‌య‌ట క‌లిపి ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ప్ర‌తి సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు నాలుగు టెస్టుల సిరీస్ అయితే.. ఒక్కో మ్యాచ్‌కు 30 పాయింట్లు కెటాయిస్తారు. గెలిస్తే.. 30 పాయింట్లు, మ్యాచ్ టై అయితే 15 పాయింట్లు, డ్రా ముగిస్తే 10 పాయింట్లు ల‌భిస్తాయి.

రెండు టెస్టుల సిరీస్ అయితే.. ఒక్కో టెస్టుకు 60 పాయింట్లు కెటాయిస్తారు. విజేత‌గా నిలిస్తే 60 పాయింట్లు, డ్రా అయితే 20 పాయింట్లు, టై అయితే 30 పాయింట్లు ల‌భిస్తాయి. మూడు టెస్టుల సీరిస్ అయితే.. ఒక్కో మ్యాచ్‌కు 40 పాయింట్లు ల‌భిస్తాయి. మ్యాచ్ గెలిస్తే 40 పాయింట్లు, డ్రా అయితే 13 పాయింట్లు, టై అయితే 20 పాయింట్లు కేటాయిస్తారు.




Next Story