ఇంకొక్కసారి ప్రయత్నించి క్రికెట్ కు గుడ్ బై చెప్తా: మిథాలీ
I know the 2022 World Cup is my swansong. మిథాలీ రాజ్ కు మహిళల ప్రపంచకప్ ను భారత్ కు అందించాలనే కోరిక తీరలేదు.
By Medi Samrat Published on 25 April 2021 8:39 PM ISTమిథాలీ రాజ్ కు మహిళల ప్రపంచకప్ ను భారత్ కు అందించాలనే కోరిక తీరలేదు. తన కెరీర్ లో ఇంకొక్కసారి ప్రయత్నించి క్రికెట్ కు గుడ్ బై చెప్తానని అంటోంది మిథాలీ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ తర్వాత తాను ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని.. వన్డే వరల్డ్‌కప్ టైటిల్ కోసం వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నిస్తానని మిథాలీ రాజ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 38 సంవత్సరాల వయసులో ఉన్న మిథాలీ రాజ్, ఇంతవరకూ 10 టెస్టులు, 214 వన్డేలు 89 టీ-20 మ్యాచ్లు ఆడింది. టీ-20లకు మిథాలీ దూరంగా ఉంటోంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 2022 నా కెరీర్‌లో చివరి ఏడాది కావొచ్చని.. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని.. అయినప్పటికీ నా ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నానని తెలిపింది మిథాలీ. వయసు పెరుగుతున్నకొద్దీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తనకు తెలుసునని వెల్లడించింది. వరల్డ్ కప్ టైటిల్ కోసం మరొక్కసారి ప్రయత్నించి, ఆపై ఆటకు రిటైర్ మెంట్ చెబుతానని స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. దాదాపు 21 సంవత్సరాల కెరీర్ ను తాను పూర్తి చేసుకున్నానని, 2022 తన కెరీర్ కు చివరి సంవత్సరం కావచ్చని తెలిపింది. "1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెట్ గ్రేట్ నెస్" అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సభలో ఆమె వర్చ్యువల్ గా పాల్గొంది. భారత మహిళాల జట్టు ఫాస్ట్ బౌలింగ్ విషయంలో కొన్ని బలహీనతలు ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో దృష్టిని సారించామని తెలిపింది. జులన్ గోస్వామి రిటైర్ అయితే, ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమని తెలిపింది.