టీ20 ప్రపంచకప్ సందడి మొదలైపోయింది. ఆదివారం నాడు శ్రీలంక, నమీబియా తలపడ్డాయి. అయితే ఇవి లీగ్ మ్యాచ్ లు..! ఇక భారత అభిమానులు ఎదురుచూసే మ్యాచ్ ఏమిటంటే.. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. రోహిత్ ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో తనకంటూ ఒక క్లారిటీ ఉందని ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించడానికి భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కూడా వారు తలపడనుంది భారత జట్టు.
ఇక రోహిత్ శర్మ పాకిస్థాన్ తో మ్యాచ్ కోసం తన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపాడు. మీడియాతో మాట్లాడిన రోహిత్, MCGలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ కోసం తన ప్లేయింగ్ XI ఏమిటో తనకు తెలుసునని, ఆటగాళ్లకు ఆ మ్యాచ్ గురించి ఇప్పటికే చెప్పేశానని అన్నాడు. ''చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకం లేదు. జట్టు ఎంపిక గురించి మా టీమ్ కు ముందుగా తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము, అలా చేస్తే వారు ముందుగానే సిద్ధమవుతారు. పాకిస్థాన్ మ్యాచ్ కోసం నా ప్లేయింగ్ XI ఇప్పటికే ఉంది. ఇప్పటికే ఆ ఆటగాళ్లకు సమాచారం అందింది. "అన్నాడు రోహిత్ శర్మ.