హైదరాబాద్ లో మ్యాచ్ కు టికెట్లు దొరకట్లేదాయె.. హెచ్‌సీఏ పై తీవ్ర విమర్శలు

Hyderabad Fans Angry On HCA. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  18 Sept 2022 4:37 PM IST
హైదరాబాద్ లో మ్యాచ్ కు టికెట్లు దొరకట్లేదాయె.. హెచ్‌సీఏ పై తీవ్ర విమర్శలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతూ ఉన్నారు. త్వరలో హైదరాబాద్ లోని ఉప్పల్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ ను చూడాలని, టికెట్లు సంపాదించాలని అనుకుంటున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురవుతూ ఉంది. ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ అసలు మ్యాచ్ టికెట్లు దొరకడం లేదు. దీంతో హైదరాబాద్ లో సాధారణంగా మ్యాచ్ టికెట్లు అమ్మే చోటుకు క్రికెట్ అభిమానులు వెళ్లారు. అక్కడ టికెట్లు దొరకడం లేదనే విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్.సి.ఏ. తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు.

ఈ నెల 25న ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఏర్పాట్లను హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పర్యవేక్షిస్తున్నారు.

ఆస్ట్రేలియా VS ఇండియా టీ20 సిరీస్ షెడ్యూల్ :

సెప్టెంబర్ 20 - మొహాలీ - తొలి టీ20

సెప్టెంబర్ 23 - నాగ్‌పూర్ - రెండో టీ20

సెప్టెంబర్ 25 - హైదరాబాద్ - మూడో టీ20


Next Story