Video : 'మా అమ్మ కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేది.. వాళ్ల వ‌ల్లే ఈ విజ‌యం'

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

By Medi Samrat
Published on : 29 April 2025 2:00 PM IST

Video : మా అమ్మ కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేది.. వాళ్ల వ‌ల్లే ఈ విజ‌యం

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. గుజరాత్ టైటాన్స్‌పై 14 ఏళ్ల వైభవ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ ఈ క్రెడిట్‌ను తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. గుజరాత్‌పై తన ఇన్నింగ్స్‌లో వైభవ్ ఏడు ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత బ్యాట్స్‌మెన్‌గా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

అయితే మ్యాచ్ త‌ర్వాత అంత తేలికగా తాను క్రికెట్‌లో విజయం సాధించలేదని వైభవ్ చెప్పాడు. తల్లిదండ్రుల కృషి వల్లే ఈ విజ‌యం సాధించాన‌ని వెల్లడించారు. ప్రాక్టీస్ సెషన్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడ‌ద‌ని తన తల్లి ఉదయాన్నే నిద్రలేచి టిఫిన్ సిద్ధం చేస్తుందని వైభవ్ చెప్పాడు. త‌న‌ తండ్రి చేస్తున్న‌ పనిని విడిచిపెట్టాడు.. తద్వారా ఆయ‌న నా క్రికెట్ కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ఇది కాకుండా.. వారిద్దరూ అనేక ఇతర ప్రయత్నాలు చేశారు. వాటి ఆధారంగా నేను కెరీర్‌లో ముందుకు సాగాన‌ని వెల్ల‌డించాడు.

ఐపిఎల్ వైభవ్ వీడియోను పోస్ట్ చేసింది.. అందులో యువ బ్యాట్స్‌మెన్.. 'నేను ఈ రోజు నా తల్లిదండ్రులకు క్రెడిట్ ఇస్తాను. నేను ప్రాక్టీస్‌కి వెళ్లాలి కాబట్టి మా అమ్మ పొద్దున్నే లేచి నాకు భోజనం వండి పెట్టేది. ఆమె కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేది. మా నాన్న నా కోసం తన పనిని వదిలిపెట్టాడు. మేము చాలా కష్టపడ్డామ‌ని పేర్కొన్నాడు. మా నాన్న నాకు మద్దతు ఇచ్చారు. నాకు సాధించగల సత్తా ఉందని చెప్పారు. ఈ రోజు ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నా.. నేను సాధించిన విజయం అంతా నా తల్లిదండ్రుల వల్లనే సాధ్య‌మ‌య్యింద‌ని చెప్పారు.

గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అతను యశస్వి జైస్వాల్ (70*)తో కలిసి మొదటి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా గుజరాత్‌ నుండి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Next Story