IPL -2024: ఫైనల్‌ విజేతకు ఎన్ని కోట్లు అంటే?

ఇవాళ చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ మధ్య ఐపీఎల్‌ ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నారు.

By అంజి  Published on  26 May 2024 5:23 PM IST
BCCI, IPL 2024, Kolkata Knight Riders, Sunrisers Hyderabad, Chennai

IPL -2024: ఫైనల్‌ విజేతకు ఎన్ని కోట్లు అంటే?

ఇవాళ చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ మధ్య ఐపీఎల్‌ ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నారు. అలాగే రన్నరప్‌కు రూ.13 కోట్లు ఇవ్వనున్నారు. ఇక మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ విజేతలకు తలో రూ.15 లక్షలు, ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌కు రూ. 20 లక్షలు, మోస్ట్‌ వాల్యుబల్‌ ప్లేయర్‌కు రూ.12 లక్షలను బీసీసీఐ ఇవ్వనుంది.

ఇవాళ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోయింది. మొదటి మ్యాచ్‌లో నాలుగు రన్స్‌ తేడాతో, రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. దీంతో నేడు జరిగే ఫైనల్‌లో కేకేఆర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తుది జట్లు

హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్, త్రిఫాఠి, మార్క్‌రమ్, క్లాసెన్, నితీశ్‌రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనద్కట్, నటరాజన్, షహబాజ్/మర్కండే

కోల్‌కతా నైట్‌ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్‌, హర్షిత్, వరుణ్, వైభవ్

Next Story