ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన హాకీ ఇండియా
హాకీ ఆసియా కప్ 2025 కోసం హాకీ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ 18 మంది సభ్యుల జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తారు.
By Medi Samrat
హాకీ ఆసియా కప్ 2025 కోసం హాకీ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ 18 మంది సభ్యుల జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తారు. జట్టు యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. పూల్-ఎలో భారత్‌కు స్థానం లభించింది.
పూల్ Aలో భారత్‌తో పాటు చైనా, జపాన్, కజకిస్తాన్ ఉన్నాయి. ఆగస్టు 29న చైనాతో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత్ తన చివరి పూల్ మ్యాచ్‌లను ఆగస్టు 31న జపాన్‌తో, సెప్టెంబర్ 1న కజకిస్థాన్‌తో ఆడనుంది.
భారత జట్టులో కృష్ణ పాఠక్‌కు గోల్‌కీపర్ బాధ్యతలు అప్పగించారు. సూరజ్ కర్కేరాను బ్యాకప్‌గా ఉంచారు.
మిడ్‌ఫీల్డర్లుగా మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, హార్దిక్ సింగ్‌లు జట్టులో ఉన్నారు. అటాకర్లుగా మన్‌దీప్ సింగ్, అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, శిలానంద్ లక్రా, దిల్‌ప్రీత్ సింగ్ ఉన్నారు.
భారత ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ రాబోయే ఆసియా కప్ ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు. ఈ టోర్నీలో ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకటించిన జట్టుపై ఆయనకు నమ్మకం ఉందని తెలిపాడు.
ఆసియా కప్‌కు భారత హాకీ జట్టు-
గోల్ కీపర్లు - కృష్ణ పాఠక్, సూరజ్ కర్కేరా
డిఫెండర్లు - సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్
మిడ్ ఫీల్డర్లు – రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్ ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్
ఫార్వర్డ్ - మన్‌దీప్ సింగ్, శిలానంద్ లక్రా, అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్
స్టాండ్ బై ఆటగాళ్లు - నీలం సందీప్ జెస్, సిల్వం కార్తీ