ఐపీఎల్-2024 వేలం.. స్టార్ బ్యాట్స్‌మెన్‌ను వదులుకోనున్న సన్‌రైజర్స్..!
ఐపీఎల్-2024కు సన్నాహాలు మొదలుపెట్టాయి జట్లు. ఈ క్రమంలోనే జట్ల కూర్పుపై దృష్టి పెట్టాయి.
By Medi Samrat Published on 25 Nov 2023 4:51 AM GMTఐపీఎల్-2024కు సన్నాహాలు మొదలుపెట్టాయి జట్లు. ఈ నేపథ్యంలోనే జట్ల కూర్పుపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను వదులుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2023 వేలంలో హైదరాబాద్ రూ.13.25 కోట్లకు బ్రూక్‌ను కొనుగోలు చేసింది. బ్రూక్ కోసం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులతో హైదరాబాద్ పోటీ పడంది. కానీ చివరికి హైదరాబాద్ అతడిని దక్కించుకుంది. అయినప్పటికీ బ్రూక్ ప్రభావం చూపలేకపోయాడు. 11 IPL మ్యాచ్‌లలో 140 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది. గత కొన్ని సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంతగా కలిసిరాలేదు. దీంతో ఈ సారి జట్టు కూర్నుపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఈ ఏడాది 14 గ్రూప్ మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. నివేదికల ప్రకారం.. బ్రూక్‌ను వదులుకోవడం వల్ల సన్‌రైజర్స్ బడ్జెట్ పెరుగుతుంది. దీంతో వారు కొంతమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకునే అవకాశం వుంది. అధికారికంగా ఇంకా ప్రకటన రానప్పటికీ ప్రచారం జోరుగా సాగుతుంది. ఏ విషయం అయినది స్పష్టత రావాల్సివుంది.
పంజాబ్ కింగ్స్ సామ్ కుర్రాన్‌ను వదులుకునే అవకాశం కనిపిస్తుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కుర్రాన్ నిలిచాడు. అతడిని రూ. 18.5 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేశాసింది. అయితే అతడి ప్రదర్శన జట్టును నిరుత్సాహపరిచింది. ఐపీఎల్-2024 ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనున్న నేపథ్యంలో జట్లు కొత్త ఆటగాళ్లనే చేర్చుకునే ప్రయత్నాలలో ఉన్నాయి.
ఐపీఎల్ 2024కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండటం లేదు. సీఎస్‌కే ఈ సమాచారం ఇచ్చింది. దీంతో CSK జట్టు బెన్ స్టోక్స్‌ను వదులుకునే ఆలోచనలో ఉంది. స్టోక్స్ స్వయంగా ఈ సీజన్‌లో ఆడేందుకు నిరాకరించాడు. దీంతో సీఎస్‌కే మరో ఆటగాడి వేటలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. ప్లేయర్స్ రిటెన్షన్, రిలీజ్ జాబితాలు అందజేసేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది. ఈ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిలీజ్, రిటైన్‌లకు సంబంధించిన పూర్తి జాబితాలను సమర్పించాలని ఆదేశించింది. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ పనిని వేగవంతం చేశాయి.