టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబైలోని వాంఖడే స్టేడియానికి చెందిన 11 మంది గ్రౌండ్స్‌మెన్‌కు తలో రూ.10 లక్షలు అందజేశాడు. వారికి ఈ చెక్కులు అందజేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియంలో తీవ్రంగా కష్టపడ్డాడు. అర్ధరాత్రి వరకు మైదానంలోనే గడిపేవాడు. హార్దిక్ ప్రాక్టీస్ కోసం అక్కడి గ్రౌండ్ స్టాఫ్ తమ విధులు ముగిసినా కూడా అదనపు గంటలు వేచి ఉన్నారు. వారు చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా ఆ సమయంలోనే వారందరికీ మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా.. ఆ 11 మంది సిబ్బందిని పిలిచి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చెక్కును అందజేశాడు.