దినేష్ కార్తీక్ పై ప్రశంసల వర్షం కురిపించిన హార్దిక్ పాండ్యా..!

Hardik Pandya hails Dinesh Karthik after Rajkot heroics. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక్ పై ప్రశంసల వర్షం కురిపించాడు

By Medi Samrat  Published on  18 Jun 2022 9:40 AM GMT
దినేష్ కార్తీక్ పై ప్రశంసల వర్షం కురిపించిన హార్దిక్ పాండ్యా..!

భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. BCCI పోస్ట్ చేసిన వీడియోలో కార్తీక్‌తో సంభాషించాడు హార్దిక్. ఎంతో మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. రాజ్ కోట్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి నోర్జే బౌలింగ్ లో వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ (4) నిరాశపరిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 17 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు దూకుడుగా ఆడి మంచి స్కోర్ వచ్చేలా చేశారు. దినేశ్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు( 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46 రన్స్) కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది.

మ్యాచ్ లో భారత్ మంచి స్కోరు సాధించింది. ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విజయం భారత్ వశమైంది. "నేను మీకు ఓ విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. మీరు చాలా మంది అబ్బాయిలకు వారి జీవితంలో ఓ స్ఫూర్తిని ఇచ్చారు" అని హార్దిక్ బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో దినేష్ కార్తీక్‌తో చెప్పాడు. "నాకు మన మధ్య జరిగిన సంభాషణలు గుర్తున్నాయి. భారత్‌కు మళ్లీ ఆడటమే నా లక్ష్యం అని, ఈ ప్రపంచకప్‌ ఆడటమే నా లక్ష్యం అని మీరు చెప్పారు. అందుకోసం నా సర్వస్వం ఇస్తానని చెప్పారు.. మీ జర్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని చెబుతున్నాను. బాగా ఆడారు సోదరా, మీ విషయంలో చాలా గర్వంగా ఉంది," అన్నారాయన.


Next Story
Share it