అందుకే ఓడిపోయాం.. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో చెప్పిన హార్దిక్ పాండ్యా

IPL 2025 సీజ‌న్‌లో 20వ మ్యాచ్ RCB-ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది.

By Medi Samrat
Published on : 8 April 2025 10:15 AM IST

అందుకే ఓడిపోయాం.. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో చెప్పిన హార్దిక్ పాండ్యా

IPL 2025 సీజ‌న్‌లో 20వ మ్యాచ్ RCB-ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (67), కెప్టెన్ రజత్ పటీదార్ (64) అర్ధ సెంచరీలతో 221 పరుగులు చేసింది. దీనికి ప్రతిగా ముంబై జట్టు 209 పరుగులు చేసి ల‌క్ష్యానికి దగ్గరికి వచ్చి గెలవలేకపోయింది.

చివరి ఓవర్లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. కృనాల్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టి 12 పరుగుల తేడాతో ముంబైని ఓడించడంలో కీల‌క పాత్ర పోషించాడు. టోర్నీలో ముంబైకి ఇది వరుసగా నాలుగో ఓటమి. ఈ ఓటమి తర్వాత ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏం మాట్లాడాడో తెలుసుకుందాం.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఇక్కడ వికెట్ చాలా బాగుంది.. మేము రెండు షాట్‌(హిట్స్‌) మిస్ అయ్యాము. RCB చివరి ఓవర్లను బాగా ఉపయోగించింది. మేము బాగా ఆడలేకపోయాము. పిచ్ బ్యాటింగ్‌కు చాలా అద్భుతంగా ఉందని.. అయితే పవర్‌ప్లేలో మేం బాగా ఆడలేకపోయామని, దీంతో చివరికి 12 పరుగుల తేడాతో వెనుకబడ్డామని చెప్పాడు. తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని హార్దిక్ చెప్పాడు. గత మ్యాచ్‌లో మెరుగైన షాట్లు కొట్టలేకపోయినా.. ఈ మ్యాచ్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉందని హార్దిక్ చెప్పాడు.

"ఇది కష్టమైన ట్రాక్.. బౌలర్లకు ఎక్కువ‌ ఎంపికలు లేవు. బ్యాట్స్‌మన్‌ను ఆపవచ్చు.. నేను బౌలర్లపై కఠినంగా ఉండకూడదనుకుంటున్నాను.. నమన్ సాధారణంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ఆడ‌గ‌ల‌డు. కానీ రోహిత్ అందుబాటులో లేకపోవడం వల్ల అతడు గ‌త మ్యాచ్‌లో ముందుగా వ‌చ్చాడు. రోహిత్‌ తిరిగి రాగానే.. నమన్ లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో దిగవలసి వ‌చ్చింది. తిలక్ తెలివైనవాడు.. గ‌త మ్యాచ్ నుంచి త్వ‌ర‌గా రిక‌వ‌రీ అయ్యాడ‌ని పేర్కొన్నాడు.

Next Story