కొడుకు, మాజీ భార్య ఫోటోల‌కు హార్దిక్ పాండ్యా కామెంట్లు.. మీరు మ‌ళ్లీ క‌ల‌వండి అంటూ..

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌లు విడాకులు తీసుకుని వారం రోజులు దాటింది. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా తాజాగా తన భార్య పోస్ట్‌ను లైక్ చేసి, కామెంట్ చేశాడు.

By Medi Samrat  Published on  24 July 2024 9:15 PM IST
కొడుకు, మాజీ భార్య ఫోటోల‌కు హార్దిక్ పాండ్యా కామెంట్లు.. మీరు మ‌ళ్లీ క‌ల‌వండి అంటూ..

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌లు విడాకులు తీసుకుని వారం రోజులు దాటింది. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా తాజాగా తన భార్య పోస్ట్‌ను లైక్ చేసి, కామెంట్ చేశాడు. నటాషా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై హార్దిక్ స్పందించాడు.

భారత జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్ నాలుగేళ్ల వివాహబంధం త‌ర్వాత‌ విడిపోయారు. T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన కొద్ది రోజులకే.. హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా నుండి విడాకులు తీసుకున్నట్లు ప్ర‌క‌టించాడు. బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశామని.. అయితే కష్టమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని హార్దిక్ తెలిపాడు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారని ధృవీకరించారు.


విడాకుల తర్వాత నటాషా స్టాంకోవిచ్ తన కొడుకు అగత్స్యతో కలిసి సెర్బియాకు వెళ్లింది. త‌న‌ కొడుకుతో కలిసి మ్యూజియం చూసేందుకు వెళ్లింది. నటాషా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొడుకు, భార్య చిత్రాన్ని చూసిన హార్దిక్ పాండ్యా వాటిని లైక్ చేశాడు. అంతేకాదు.. హార్దిక్ హార్ట్ ఎమోజీతో పాటు మరో మూడు విభిన్న ఎమోజీలతో కామెంట్ రాశాడు. దీనిని చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మీరు మ‌ళ్లీ క‌ల‌వండి అంటూ కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్ అవుతుంది.

Next Story