15 మందితో ఆసియా క‌ప్‌కు టీమ్‌ను ప్ర‌క‌టించిన హర్భజన్

ఆసియా కప్-2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం టోర్నమెంట్ వ‌న్డే ఫార్మాట్

By Medi Samrat  Published on  18 Aug 2023 5:00 PM IST
15 మందితో ఆసియా క‌ప్‌కు టీమ్‌ను ప్ర‌క‌టించిన హర్భజన్

ఆసియా కప్-2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం టోర్నమెంట్ వ‌న్డే ఫార్మాట్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతుంది. నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో.. మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఆసియా కప్ 2023లో భారత్ సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఆసియా కప్-2023 కోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు తమ టీమ్‌ల‌ను ప్రకటించాయి. తొలిసారిగా టోర్నీలో పాల్గొంటున్న నేపాల్ కూడా జట్టును ప్రకటించింది. అయితే భారత జట్టు మాత్రం ఇంకా టీమ్‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఆసియా కప్‌కు త‌న ఫేవ‌రేట్‌-15 జ‌ట్టును ప్ర‌క‌టించాడు.

హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ జట్టును ప్రకటించారు. శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. వన్డేల్లో సంజు, అయ్యర్‌లు రాణిస్తున్నారు. వీరిద్దరి స్థానంలో ఇటీవలే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మను హర్భజన్ ఎంపిక‌చేశాడు. పేలవమైన ఫామ్ ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ల‌కు స్థానం క‌ల్పించాడు.

కేఎల్ రాహుల్‌కు జట్టులో స్థానం కల్పించాడు. దీంతో పాటు ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకున్నాడు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, చాహల్ ల‌ను ఎంపిక చేయ‌గా.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లను ఎంపికచేశాడు.

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్.

Next Story