హర్భజన్ ఒంటిపై సూపర్ స్టార్ రజనీ టాటూ

Harbhajan Singh got Rajinikanth's tattoo on his chest. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు ఈరోజు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు

By Medi Samrat  Published on  12 Dec 2021 4:51 PM GMT
హర్భజన్ ఒంటిపై సూపర్ స్టార్ రజనీ టాటూ

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు ఈరోజు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు పండగలా జరుపుకుంటున్నారు. ఈరోజు సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.పలువురు క్రికెటర్లు రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత జట్టు మాజీ క్రికెటర్, హర్భజన్ సింగ్ కూడా రజనీకాంత్‌కు ప్రత్యేకమైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. హర్భజన్ తన ఛాతీపై రజనీకాంత్ టాటూను చూపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ట్వీట్‌లో టాటూ చూపిస్తూ హర్భజన్ సింగ్ రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. తమిళంలో ఓ పెద్ద సందేశాన్ని కూడా రాశాడు. రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. హర్భజన్ సింగ్ టాటూ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమైన టాటూనా అని అడుగుతున్నారు.

ఈ మధ్య కాలంలో హర్భజన్ వార్తల్లో ఉంటున్నాడు. హర్భజన్ సింగ్ పంజాబ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో చేరతారని కొంతకాలం క్రితం ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇది తప్పుడు కథనాలు అని భజ్జీ స్వయంగా పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. హర్భజన్ సింగ్ త్వరలో ఐపీఎల్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా లేదా మరేదైనా పాత్రలో కనిపించవచ్చని చెబుతున్నారు. టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించిన భజ్జీ.. IPLలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. భజ్జీ గత సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.


Next Story
Share it