పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ : మ్యాచ్ మధ్యలో వాష్ రూమ్‌కు పరుగు తీసిన బ్యాట్స్‌మన్.. వీడియో వైర‌ల్‌

Hafeez trolled for taking loo break. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) ముగియ‌డంతో.. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌(పీఎస్ఎల్‌)

By Medi Samrat  Published on  16 Nov 2020 1:56 PM IST
పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ : మ్యాచ్ మధ్యలో వాష్ రూమ్‌కు పరుగు తీసిన బ్యాట్స్‌మన్.. వీడియో వైర‌ల్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) ముగియ‌డంతో.. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌(పీఎస్ఎల్‌) కు మార్గం సుగ‌మ‌మైంది. మార్చిలో ఈ లీగ్ ను నిర్వ‌హించ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ్రూప్ మ్యాచ్‌లు ముగిసిన వెంట‌నే వాయిదా వేశారు. విదేశీ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసేదేంలేక భారత క్యాష్ రిచ్ లీగ్ తర్వాతే లీగ్ రీస్టార్ట్ చేయాలని నిర్ణయించింది. ఇక ఐపీఎల్ ముగియ‌గానే.. శ‌నివారం నుంచి ఈ టోర్నీ క్వాలిపై మ్యాచ్‌లు ప్రారంభమ‌య్యాయి.



లాహోర్ ఖలాండర్స్, పెష్వార్ జల్మీ మధ్య ఎలిమినేట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ హ‌పీజ్ చేసిన ఓ ప‌నితో అటు ఆట‌గాళ్ల‌తో పాటు ఇటు అభిమానులు తెగ న‌వ్వుకున్నారు. లాహోర్ ఖలాండర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 12 ఓవర్ ఫస్ట్ బాల్‌కు బెన్ డక్ ఔటవ్వగా.. అతనితో పాటు మహ్మద్ హఫీజ్ కూడా మైదానం వీడాడు. దాంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే టీవీ ప్రేక్షకులకు మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ బ్రేక్‌లో పెష్వార్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, వహబ్ రియాజ్, ఇమామ్ ఉల్ హక్ ఒక్కదగ్గరికి చేరి ముచ్చటిస్తుండగా.. వారిని కామెంటేటర్ రమీజ్ రాజా పలకరించాడు.

ఇప్పుడేమైనా టైమ్ ఔటా.. హఫీజ్ మైదానం వీడాడెందుకని ప్రశ్నించాడు. దీనికి ఇమామ్ ఉల్ హక్ ఫన్నీగా బదులిచ్చాడు.హఫీజ్ ( '2 ఓవర్స్ సే కే రహా హై ముజే సుసు ఆరా హై'') గత రెండు ఓవర్లుగా తనకు అర్జెంట్ అని, వాష్ రూమ్‌కు వెళ్తానని అడుగుతున్నాడని తెలిపాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ మ్యాచ్‌లో

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పెష్వార్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్(39), హర్దస్ విజియోన్(37)టాప్ స్కోరర్లుగా నిలిచారు. మహ్మద్ హఫీజ్(74 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో లాహోర్ ఖలాండర్స్ 5 వికెట్లతో గెలుపొంది టోర్నీలో ముందడుగువేసింది.


Next Story