IPL 2025లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు బాగా దగ్గరైంది. ఆడిన 9 మ్యాచ్ లలో ఆరింటిలో గెలిచి పాయింట్స్ టేబుల్ లో మంచి స్థితిలో ఉంది. ఇక హైదరాబాద్ జట్టు టోర్నమెంట్ ను ఘనంగా మొదలుపెట్టినా, విజయాలు దక్కడం లేదు. దారుణమైన ఓటములు హైదరాబాద్ చవిచూసింది. ఇక ఆడే ప్రతి ఒక్క మ్యాచ్ సన్ రైజర్స్ కు డూ ఆర్ డై. ఓడిపోయిందంటే టోర్నమెంట్ నుండి అవుట్ అయినట్లే!!
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో జిటి, ఎస్‌ఆర్‌హెచ్‌లు ఐదుసార్లు తలపడ్డాయి, వాటిలో గుజరాత్ నాలుగుసార్లు గెలిచింది. ఈ సీజన్ ప్రారంభంలో హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డ శుభ్‌మాన్ గిల్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి.