GT vs CSK : రుతురాజ్ సిక్స‌ర్ల మోత‌.. టైటాన్స్ ల‌క్ష్యం ఎంతంటే..

Gujarat Titans vs Chennai Super Kings Live Update. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో

By Medi Samrat
Published on : 31 March 2023 9:46 PM IST

GT vs CSK : రుతురాజ్ సిక్స‌ర్ల మోత‌.. టైటాన్స్ ల‌క్ష్యం ఎంతంటే..
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రుగుతున్న‌ IPL 2023 ప్రారంభ మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణిత‌ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 178 ప‌రుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92(9 సిక్స్‌లు, 4 ఫోర్లు) పరుగులు చేశాడు. అయితే.. అతనికి ఇతర CSK బ్యాటర్ల నుండి మద్దతు లభించలేదు. సీఎస్‌కే కెప్టెన్ ధోనీ 7 బంతుల్లో 14 (నాటౌట్, ఒక సిక్స్‌, ఒక ఫోర్‌) చివ‌ర్లో మెరిశాడు. రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్‌లు త‌లా రెండు వికెట్లు తీయ‌గా.. జాషువా లిటిల్ ఒక‌ వికెట్ తీశాడు. అంతకుముందు గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.


Next Story