IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Gujarat Titans vs Chennai Super Kings. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ ఎడిషన్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ

By Medi Samrat  Published on  31 March 2023 7:24 PM IST
IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న‌ గుజరాత్ టైటాన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ ఎడిషన్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అరిజిత్ సింగ్ ప్రత్యేక సంగీత ప్రదర్శనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత‌రం తమన్నా భాటియా, రష్మిక మందన్న డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. ఇదిలావుంటే.. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, MS ధోని(w/c), రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్




Next Story