టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలతో దాదాపు 12 నెలలు పాటు జట్టుకు దూరంగా ఉన్న గ్రీన్ ఈ ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పునరాగమనం చేశాడు. ఇప్పుడు వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టింది.
గ్రీన్ స్ధానాన్ని స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ఇటీవల షెఫీల్డ్ షీల్డ్, డొమెస్టిక్ వన్డే టోర్నీలో అద్భుత ప్రదర్శనతో మంచి ప్రదర్శన చేశాడు లాబుషేన్. ఆస్ట్రేలియా వన్డే కప్‌లో ఇప్పటి వరకు 3 మూడు మ్యాచ్‌లు ఆడిన లబుషేన్ 237 పరుగులు సాధించాడు. అందులో 2 శతకాలు ఉన్నాయి. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆసీస్-భారత్ జట్లు తలపడనున్నాయి