దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌న్నుమూత.. విషాదంలో అభిమానులు

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కోచ్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధృవీకరించాయి.

By Medi Samrat  Published on  5 Aug 2024 4:30 PM IST
దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌న్నుమూత.. విషాదంలో అభిమానులు

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కోచ్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధృవీకరించాయి. థోర్ప్ 1993 నుండి 2005 వరకు ఇంగ్లాండ్ తరపున ఆయ‌న‌ 100 టెస్ట్ మ్యాచ్‌లు, 82 వ‌న్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత థోర్ప్.. ఇంగ్లాండ్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ప‌నిచేశారు.

థోర్ప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. థోర్ప్ అనారోగ్యం గురించి ఎటువంటి నివేదిక బ‌య‌ట‌కు రాలేదు.. చాలా కాలం పాటు అనారోగ్యంతో పోరాడిన తరువాత.. ఆయ‌న‌ 55 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

గ్రాహం థోర్ప్ మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉందని ECB ట్విట్టర్‌లో రాసింది. గ్రాహం మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దానిని మాటల్లో వ్యక్తీకరించడం కష్టం. క్రికెట్ ప్రపంచం, అతని అభిమానులు ఆయ‌న‌ను ఎప్పుడూ మిస్ అవుతారని సంతాప సందేశంలో పేర్కొంది.

గ్రాహం థోర్ప్ 100 టెస్టుల‌లో 16 సెంచ‌రీలు, 39 అర్ధ సెంచ‌రీల‌తో 6,744 ప‌రుగులు చేశాడు. 82 వ‌న్డేల‌లో 21 అర్ధ సెంచ‌రీల‌తో 2,380 ప‌రుగులు చేశాడు. ప‌స్ట్ క్లాస్‌, లిస్టు ఏ క్రికెట్‌లో ఆయ‌న భారీ రికార్డులు ఉన్నాయి.

Next Story