విరాట్ కోహ్లీ 'ఆస్ట్రేలియన్‌'.. మాక్స్‌వెల్ ఆ మాట‌ ఎందుకు అన్నాడంటే..

ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు టాప్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లను ప్ర‌ద‌ర్శ‌న చూసేందుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఉత్సాహంగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు

By Medi Samrat  Published on  14 Sept 2024 7:13 AM IST
విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్‌.. మాక్స్‌వెల్ ఆ మాట‌ ఎందుకు అన్నాడంటే..

ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు టాప్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లను ప్ర‌ద‌ర్శ‌న చూసేందుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఉత్సాహంగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు. ప్రస్తుత యుగంలో 'ఫ్యాబ్ ఫోర్' బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ, స్మిత్‌లు ఉన్నారు, ఇందులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ కూడా ఉన్నారు.

మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. 'ఈ ఇద్దరు సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్మిత్, కోహ్లీ ఆడుతున్న తీరు, వారి బ్యాటింగ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫలితంపై చాలా ప్రభావం చూపుతుందని నేను భావిస్తున్నాను. ఇద్దరిలో.. ఇద్ద‌రూ లేదంటే ఒకరు చాలా పరుగులు చేయబోతున్నారు. ప్ర‌స్తుత‌ కాలంలో ఈ ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ళు ముఖాముఖిగా ఆడటం చూడటం సరదాగా ఉంటుందన్నాడు.

కోహ్లి, స్మిత్ ఇద్దరూ మాజీ కెప్టెన్లు. మైదానంలో ఇద్దరి మధ్య చాలాసార్లు తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. అయితే ఇటీవలి కాలంలో వీరి సంబంధాలు మెరుగయ్యాయి. స్మిత్ వైఖరి గురించి మాట్లాడితే.. భారత ఆటగాళ్లలో కోహ్లీ కూడా ఆస్ట్రేలియన్ చెప్పాడు. 'విరాట్ కోహ్లీ ఆలోచన, చర్యల‌ పరంగా ఆస్ట్రేలియన్ అని నేను నమ్ముతున్నాను. అతడు సవాళ్లను ఎదుర్కొని ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించే విధానం బాగుంటుంది. భారత ఆటగాళ్లలో అత‌డు ఒక్క‌డే ఆస్ట్రేలియన్ లా క‌నిపిస్తాడని స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. ఇదిలావుంటే.. నవంబర్ 22న పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

Next Story