గౌతమ్ గంభీర్ దోషంటూ తేల్చిన ఢిల్లీ హైకోర్టు

Gautam Gambhir's Bhagat Singh Tweet After Drug Body Accuses Him In Court. మాజీ క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఢిల్లీలో క‌రోనా రోగుల‌కు

By Medi Samrat  Published on  3 Jun 2021 2:18 PM GMT
గౌతమ్ గంభీర్ దోషంటూ తేల్చిన ఢిల్లీ హైకోర్టు

మాజీ క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఢిల్లీలో క‌రోనా రోగుల‌కు ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను పంచడం వివాదాస్పదమైంది. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్‌ పై డ్ర‌గ్ కంట్రోల‌ర్ విచార‌ణ చేప‌ట్టింది. గౌతం గంభీర్ ఫౌండేష‌న్ మ‌త్రం అక్ర‌మ రీతిలో ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను నిల్వ చేసింద‌ని, ఈ కేసులో గంభీర్ ఫౌండేష‌న్ దోషిగా తేలిన‌ట్లు ఢిల్లీ హైకోర్టుకు ఆ రాష్ట్ర డ్ర‌గ్ కంట్రోల‌ర్ శాఖ తెలిపింది. డ్ర‌గ్స్ అండ్ కాస్మ‌టిక్స్ యాక్ట్ కింద గంభీర్ ఫౌండేష‌న్ నేరం చేసిన‌ట్లు డ్ర‌గ్ కంట్రోల‌ర్ త‌ర‌పున అడ్వ‌కేట్ వాదించారు. ఇదే యాక్ట్ ప్ర‌కారం ఆప్ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ కుమార్ కూడా దోషిగా తేలారు. దోషిగా తేలిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు డీజీసీఐని ఆదేశించింది. ఈ కేసులో మ‌ళ్లీ జూలై 29న విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.

ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఇటీవ‌ల వేలాది మందికి ఫాబీఫ్లూ మందుల‌ను ఉచితంగా అంద‌జేశారు. క‌రోనా వైర‌స్‌తో బాధ‌ప‌డుతున్న పాజిటివ్ పేషెంట్ల‌కు ఆయ‌న ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను ఇచ్చారు. దీనిపై కోర్టులో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వ్యాజ్యం దాఖ‌లైంది. గంభీర్ అక్ర‌మ రీతిలో ఫాబీప్లూ మందుల‌ను భారీ సంఖ్య‌లో సేక‌రించిన‌ట్లు పిల్‌లో ఆరోపించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఢిల్లీ హైకోర్టు.. డీసీజీఐని ఆదేశించింది. పిల్ అంశంలో జ‌స్టిస్ విపిన్ సింగ్ స్పందిస్తూ స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా లేని ఆ ఔష‌ధాన్ని గంభీర్ ఎలా సంపాదించారని, ఆయ‌న ఉద్దేశం మంచిదే అయినా.. కానీ ఇది మంచి ప్ర‌వ‌ర్త‌న కాదని జ‌స్టిస్ ప్ర‌శ్నించారు. ఢిల్లీ పోలీసుల నివేదిక ప్ర‌కారం ఎంపీ గంభీర్ సుమారు 2862 ఫాబీఫ్లూ స్ట్రిప్పుల‌ను కొనుగోలు చేశారు. గార్గ్ హాస్పిట‌ల్‌కు చెందిన డాక్ట‌ర్ సంజ‌య్ గార్గ్ ఇచ్చిన ప్రిస్క్రిప్ష‌న్ ప్ర‌కారం గంభీర్ ఫాబ్లీ ఫ్లూ ట్యాబ్లెట్ల‌ను తెప్పించారు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది.


Next Story