టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ట్వీటర్ ద్వారా తెలియజేశారు. కరోనా యొక్క తేలికపాటి లక్షణాలతో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకొని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్‌లో కోరారు.
ఇదిలావుంటే.. గౌతం గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అలాగే ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్ గా కూడా వ్యవహరించనున్నాడు. గౌతమ్ గంభీర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. భారత్ తరఫున 54 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్‌లను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు.