ధర ట్యాగ్ స్టార్క్‌పై అదనపు ఒత్తిడిని క‌లిగించ‌దు : గంభీర్

గౌతమ్ గంభీర్ IPL 2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరిగి వచ్చాడు. ఐపీఎల్ 2012, 2014లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్..

By Medi Samrat  Published on  15 March 2024 4:43 PM IST
ధర ట్యాగ్ స్టార్క్‌పై అదనపు ఒత్తిడిని క‌లిగించ‌దు : గంభీర్

గౌతమ్ గంభీర్ IPL 2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరిగి వచ్చాడు. ఐపీఎల్ 2012, 2014లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్.. ఇప్పుడు జట్టుకు మెంటార్‌గా చేరాడు. KKRలో చేరడంపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, “KKR నాకు కేవలం ఫ్రాంచైజీ మాత్రమే కాదు.. ఒక మ‌ర్చిపోలేని అనుభూతి అని నేను ఎప్పుడూ పేర్కొన్నాను. అందుకే మళ్లీ వచ్చినందుకు ఆనందంగా ఉంది.'' అంటూ ఏడేళ్ల తర్వాత మళ్లీ కేకేఆర్‌లోకి వచ్చిన గంభీర్ పేర్కొన్నాడు.

2011లో నైట్ రైడ‌ర్స్‌లో చేరిన గంభీర్ 2017 వరకూ జట్టులోనే ఉన్నాడు. ఈ కాలంలో KKR ఐదుసార్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. 2014లో ప్రస్తుతం నిలిచిపోయిన ఛాంపియన్స్ లీగ్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. గంభీర్ మాట్లాడుతూ.. "కెకెఆర్ అభిమానులు అంచనాలను కలిగి ఉంటారని నాకు తెలుసు. నేను వాటిని అందుకొని వారిని సంతోషపెట్టాలని ఆశిస్తున్నాను" అని చెప్పాడు.

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఏ ఆటగాడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా ఉంటాడో గౌతమ్ గంభీర్ చెప్పాడు. గంభీర్ ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్‌ని ఎంచుకున్నాడు. ధర ట్యాగ్ స్టార్క్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని నేను భావించడం లేదు అని అతను చెప్పాడు. అతను ఆస్ట్రేలియన్ క్రికెట్ కోసం ఏమి చేస్తున్నాడో.. అతడు KKR కోసం అదే చేస్తాడని నేను ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించగా.. ఇందులో భారత ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. త్వరలో విదేశీ ఆటగాళ్లు కూడా కేకేఆర్‌లో చేరనున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో హోమ్ మ్యాచ్ ఆడడం ద్వారా IPL 2024ను ప్రారంభించనుంది.

Next Story