టీమిండియా విజయం కంటే గంభీర్ ట్వీట్‌పైనే చర్చ జ‌రుగుతోంది..!

టీమిండియా విజయం కంటే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.

By -  Medi Samrat
Published on : 22 Jan 2026 1:00 PM IST

టీమిండియా విజయం కంటే గంభీర్ ట్వీట్‌పైనే చర్చ జ‌రుగుతోంది..!

టీమిండియా విజయం కంటే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ఒక రోజు ముందు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలుసుకుని మరీ ప్రశంసించారు. ప్రధానమంత్రి తర్వాత అత్యంత కష్టపడి పనిచేసే వ్యక్తి గంభీర్‌గా అభివర్ణించాడు. భారత్ విజయం తర్వాత దీనిపై కోచ్ గంభీర్ సమాధానమిచ్చాడు. ఎక్స్‌లో పోస్ట్‌ను పంచుకుంటూ అతనికి ధన్యవాదాలు తెలిపారు.

నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌కి ముందు సమావేశం తరువాత శ‌శి థరూర్ సోషల్ మీడియాలో గంభీర్‌పై తన గౌరవాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించడం అనేది చాలా ఒత్తిడి, విమర్శలను కలిగి ఉండే స్థానం అని అతను అంగీకరించాడు.

థరూర్ స్పందనపై కోచ్ గౌతమ్ గంభీర్ 'X'లో ఇలా రాశాడు. చాలా ధన్యవాదాలు @ShashiTharoor! దుమ్ము దులుపుకున్నప్పుడు కోచ్‌కు 'అపరిమిత అధికారం' ఉందన్న నిజం, తర్కం స్పష్టమవుతుంది. అప్పటి వరకూ నేను నా స్వంత, ఉత్తమమైన వారితో పోటీ పడటానికి నేను నవ్వుతానని బ‌దులిచ్చాడు.

గంభీర్ ట్వీట్‌ తర్వాత.. సెలక్షన్ కమిటీని గంభీర్ టార్గెట్ చేశాడా అనే చర్చ జోరందుకుంది. అయితే.. గంభీర్ ఎవరి పేరును తీసుకోలేదు.. ఎవరినీ ప్రస్తావించలేదు. నిరంతరం విమర్శలతో చుట్టుముట్టడంతో.. గంభీర్ విజయం తర్వాత తన ప్రకటనతో ఆ విమర్శకులకు సమాధానం ఇస్తున్నాడని నెటిజ‌న్లు అంటున్నారు.

Next Story