గంభీర్ చేసిన పనికి పాక్ అభిమానులు గుస్సా

Gautam Gambhir Poses With Sri Lanka's Flag. ఆసియా కప్ లో ఎవరూ ఊహించని విధంగా ఆడిన శ్రీలంక టైటిల్ ను సొంతం చేసుకుంది.

By Medi Samrat  Published on  12 Sep 2022 12:15 PM GMT
గంభీర్ చేసిన పనికి పాక్ అభిమానులు గుస్సా

ఆసియా కప్ లో ఎవరూ ఊహించని విధంగా ఆడిన శ్రీలంక టైటిల్ ను సొంతం చేసుకుంది. మొదట్లో కనీసం సూపర్ 4 కు కూడా శ్రీలంక క్వాలిఫై అవ్వదని అన్నారు. కానీ ఏ మాత్రం బెదురు లేకుండా ఆడి ఆఫ్ఘన్, భారత్ లను ఓడించి.. ఇక ఫైనల్ కు ముందు ఒకసారి.. ఫైనల్ లో మరోసారి పాక్ ను చిత్తు చిత్తు చేసి టైటిల్ ను ఎగరేసుకుపోయింది.

ఇక శ్రీలంక చాంపియన్ గా నిలిచిన వెంటనే.. ఆసియా కప్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ శ్రీలంక జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం గంభీర్ బౌండరీ లైన్ వద్ద శ్రీలంక జాతీయ పతాకాన్ని చేతబూని లంక అభిమానుల ముందు ప్రదర్శించాడు. గంభీర్ తమ జెండాను ప్రదర్శించడం చూసి లంక అభిమానులు ఎంతో ఆనందించారు. శ్రీలంక జట్టును సూపర్ స్టార్ టీమ్ అని అభివర్ణించాడు. ఆసియా కప్ విజేతగా వారు అన్ని విధాలా అర్హులని.. లంక జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. గంభీర్ చేసిన పనికి పాక్ అభిమానులు మాత్రం గుస్సా అవుతున్నారు.

ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక జట్టు విజేతగా నిలిచింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ ను 23 పరుగుల తేడాతో ఓడించింది. పాక్ జట్టు 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో పాక్ ఓపెనర్ రిజ్వాన్ (55) అర్ధసెంచరీతో రాణించగా, ఇఫ్తికార్ అహ్మద్ 32 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా పాక్ జట్టులో మిగతా వాళ్లందరూ విఫలమయ్యారు.



Next Story