ఆ మంచి నిర్ణయం ఎప్పుడో తీసుకున్న గంభీర్..1
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మూడవ, చివరి మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్' అవగాహన కార్యక్రమం ప్రారంభించనున్నారు.
By Medi Samrat
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మూడవ, చివరి మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్' అవగాహన కార్యక్రమం ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రచారానికి భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే సహకరించినట్లు ఎవరికీ తెలియదు.
గంభీర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక సంస్థకు తన కళ్ళు, గుండె, కాలేయం, కిడ్నీ వంటి ముఖ్యమైన అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనున్న సందర్భంగా ‘డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్’ పేరుతో అవగాహన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని ఐసీసీ చైర్మన్ జే షా తెలిపారు. క్రీడారంగంలో.. స్ఫూర్తిని నింపే శక్తి, ప్రజలను అనుసంధానం చేసే శక్తి ఉందని, మైదానం వెలుపల కూడా సానుకూల ప్రభావం చూపుతుందని జే షా అన్నారు. జీవన్ దాన్ అనే గొప్ప బహుమతిని అందించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని ఈ చొరవ ద్వారా మేము అభ్యర్థిస్తున్నాము. ఒక తీర్మానం, ఒక నిర్ణయం చాలా మంది జీవితాలను కాపాడుతుంది. మార్పు తీసుకురావడానికి మనమందరం కలిసి సహకరిద్దాం అని కోరారు. అయితే గంభీర్ భారత జట్టుకు ఆడుతున్నప్పుడు.. తను మరణించిన తర్వాత తన ముఖ్యమైన అవయవాలను ఒక సంస్థకు దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అపోలో ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్స్ తో కలిసి ఇతరులను కూడా అవయవ దానం చేయమని ప్రోత్సహించడానికి "గిఫ్ట్ ఎ లైఫ్" కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
అహ్మదాబాద్‌లో జరిగే మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడవ మ్యాచ్‌లో కూడా.. కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు గెలవాలని కోరుకుంటున్నాడు.. తద్వారా క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అవసరమైన ఆత్మవిశ్వాసంతో వెళ్లవచ్చు.
z