టీ20 ప్రపంచ కప్-2021లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరుగనుంది. చివరిసారిగా ఈ రెండు జట్లు 2019 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. అయితే.. భారత్, పాక్ మ్యాచ్‌పై గౌతమ్ గంభీర్ స్పందించాడు. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధిస్తుందని చెప్పాడు. ఐసిసి మెగా ఈవెంట్లలో మెన్ ఇన్ గ్రీన్ పై భారత్ మంచి రికార్డును కలిగి ఉందని.. పాక్‌పై భారత్ వన్డే ప్రపంచకప్‌లో ఏడు సార్లు, టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు గెలిచిందని గుర్తుచేశాడు. భారత్ బలమైన జట్టని.. బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ జట్టుపై భారత్ విజయం సాధిస్తుందని గంభీర్ అన్నాడు.
ఈ సందర్భంగా జట్టుకు గంభీర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇప్పటి వరకు మంచి ప్రదర్శన చేశారు. టీమిండియా తప్పకుండా గెలుస్తుంది. ఆటగాళ్లపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. ఏ రాజకీయ వత్తిడి వారి ఆటతీరుపై ప్రభావం చూపదు. జట్టు బాగా ఆడుతుంది.. గెలుస్తుందని గంభీర్ పేర్కొన్నాడు. అయితే.. యుఏఈలో పాకిస్తాన్ చాలా క్రికెట్ ఆడింది. అక్కడి పరిస్థితులకు జట్టు బాగా అలవాటుపడింది. దీనివల్ల ప్రత్యర్ధి జట్టుపై వారికి గట్టి పట్టున్నట్లు భావిస్తున్నారు. దీంతో భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ మెరుగైన జట్టు అని ప్రకటనలు వస్తున్న తరుణంలో గంభీర్ టీమ్ ఇండియా ఆటతీరును సమర్ధించాడు. జట్టు ఏదైనా ప్రత్యర్థిపై భారత్ ఆధిపత్యం చెలాయించగలదని నొక్కి చెప్పాడు.