కోహ్లీ కెప్టెన్సీ మీద ఇంత పగ ఎందుకు సార్ మీకు ..?
Gautam Gambhir not happy with Virat Kohli’s handling of Jasprit Bumrah. భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను విరాట్
By Medi Samrat Published on 30 Nov 2020 10:19 AM GMTభారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీ నిర్వర్తిస్తూ ఉన్నాడు. విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా బెటర్ గా ఉంటుందని ఎంతో మంది క్రీడా పండితులు చెప్పుకొస్తూ ఉన్నారు. గౌతమ్ గంభీర్ మొదటి నుండి కోహ్లీ కెప్టెన్సీని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. కోహ్లీ ఐపీఎల్ లో కూడా కెప్టెన్ గా ఒక ఫెయిల్యూర్ అని చెబుతుండే గంభీర్.. భారతజట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు.
తాజాగా మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో కోహ్లీ కెప్టెన్సీని తప్పుబడుతూ విమర్శలు చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తనకు అర్థంకావడంలేదని.. జస్ప్రీత్ బుమ్రాతో కొత్త బంతితో ఎక్కువ ఓవర్లు వేయించకపోవడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. ప్రపంచంలో ఏ కెప్టెన్ కూడా బుమ్రా వంటి బౌలర్ కు రెండు ఓవర్లు ఇచ్చి ఆపేయడని.. రెండు ఓవర్ల తర్వాత బుమ్రాను కోహ్లీ పక్కనబెట్టడం చాలా తప్పని అన్నాడు.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ వారి ప్రధాన బౌలర్ జోష్ హేజెల్ వుడ్ ను ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాడో పరిశీలించాలని గంభీర్ చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో హేజెల్ వుడ్ తో వరుసగా 6 ఓవర్లు వేయించారని, రెండో వన్డేలో వరుసగా 5 ఓవర్లు వేయించారని, దాని ఫలితమే టీమిండియా టాపార్డర్ ఇబ్బందిపడిందని అన్నాడు. బుమ్రాకు కూడా ఎక్కువ ఓవర్లు ఇచ్చి బౌలింగ్ చేయించి ఉంటే వార్నర్, ఫించ్, స్మిత్ లను ఇబ్బంది పెట్టేవాడని గంభీర్ చెప్పాడు. ఫామ్ లో ఉన్న ఈ ముగ్గురిని బుమ్రా అవుట్ చేయగలడని నమ్మకంగా చెప్పాడు. ఓపెనింగ్ స్పెల్ లో కేవలం 2 ఓవర్లు వేయించి, 10వ ఓవర్ తర్వాత మళ్లీ బౌలింగ్ కు తీసుకువస్తే పాతబడిన బంతితో వికెట్లు తీయలేరని అన్నాడు గంభీర్.