మాజీ క్రికెటర్, భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పోర్ట్స్ క్రీడాతో మాట్లాడుతూ.. తన ఆల్-టైమ్ వరల్డ్ XIని ప్రకటించాడు. గౌతమ్ గంభీర్ తన ఆల్-టైమ్ వరల్డ్ XI జట్టులో ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేశాడు. అందులో దక్షిణాఫ్రికాకు చెందిన AB డివిలియర్స్, వెస్టిండీస్ కు చెందిన బ్రియాన్ లారా, పాకిస్తాన్ కు చెందిన ఇంజమామ్ ఉల్ హక్ పేర్లను చేర్చాడు. అయితే గౌతమ్ గంభీర్ ప్రత్యేకంగా ఎవరినీ కెప్టెన్ గా ఎంపిక చేయలేదు.
గంభీర్ వరల్డ్ ఎలెవన్‌లో ఓపెనర్లుగా అడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్ ఉన్నారు. మిడిలార్డర్‌లో ఏబీ డివిలియర్స్, ఇజమామ్ ఉల్ హక్, బ్రియాన్ లారాలకు చోటు కల్పించాడు. ఆల్ రౌండర్లుగా ఆండ్రూ సైమండ్స్, అబ్దుల్ రజాక్, ఆండ్రూ ఫ్లింటాఫ్ ప్లేయింగ్-11లో ఎంపికయ్యారు. స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీధరన్, ఫాస్ట్ బౌలర్లుగా షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యారు. గంభీర్ వరల్డ్ ఎలెవన్‌లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల నుండి ఏ ఆటగాడికి చోటు లభించలేదు. రికీ పాంటింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి ఆటగాళ్లకు కూడా చోటు దక్కలేదు.
గౌతమ్ గంభీర్ ఎంపిక చేసిన వరల్డ్ ఎలెవన్
ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హెడెన్, ఏబీ డివిలియర్స్, బ్రియాన్ లారా, ఇంజమామ్ ఉల్ హక్, ఆండ్రూ సైమండ్స్, అబ్దుల్ రజాక్, ఆండ్రూ ఫ్లింటాఫ్, ముత్తయ్య మురళీధరన్, షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్.