టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధంగా లేదు.. కోచ్ షాకింగ్ ప్ర‌క‌ట‌న‌

ప్రస్తుత టీమ్ ఇండియా ప‌రిస్థితుల‌పై భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

By -  Medi Samrat
Published on : 10 Nov 2025 3:18 PM IST

టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధంగా లేదు.. కోచ్ షాకింగ్ ప్ర‌క‌ట‌న‌

ప్రస్తుత టీమ్ ఇండియా ప‌రిస్థితుల‌పై భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఫలితాలపై దృష్టి కేంద్రీకరించే 2026లో సొంతగడ్డపై జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధమవుతోందని చెప్పాడు. ఇటీవల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన భారత్.. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడాల్సివుంది. గౌతమ్ గంభీర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ టీజర్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. గంభీర్ తన నాయకత్వంలోని భారత జట్టు ఆలోచన గురించి సమాచారం ఇచ్చాడు.

వీడియోలో గంభీర్ సాకులు చెప్ప‌డం కంటే అభ్యాసానికి విలువనిస్తానని స్పష్టం చేశాడు. ఆత్మసంతృప్తి కోసం అతని అసహనాన్ని నొక్కి పెడ‌తాన‌న్నాడు. 'ఒక దేశంగా, వ్యక్తిగతంగా మనం ఎప్పుడూ సిరీస్ ఓటమిని వేడుక‌గా జరుపుకోము' అని అతను చెప్పాడు. పూర్తి అంకితభావం, జవాబుదారీతనం కోరుతున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

ప్లేయర్ డెవలప్‌మెంట్, లీడర్‌షిప్ అనే అంశంపై గంభీర్ మాట్లాడుతూ.. ఒత్తిడిలో ఉన్న ఆటగాడిని పరీక్షించడం వ‌ల్ల అతనిలోని అత్యుత్తమ ప్రదర్శనను బ‌య‌ట‌కు తెస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పాడు. దీనిని వివరించేందుకు, తను టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించడాన్ని ఉదాహరణగా చెప్పాడు. కుర్రాళ్లను లోతైన సముద్రంలో పడేయండి అని గంభీర్ అన్నాడు. ఇది సరళమైన పద్ధతి. టెస్టు కెప్టెన్‌గా నియమితులైనప్పుడు శుభ్‌మన్ గిల్‌తోనూ మేము అలాగే చేశాం. గంభీర్ మాట్లాడుతూ.. తాను, తన సహాయక సిబ్బంది ఓపెన్‌నెస్, నిజాయితీ సంప్రదాయాన్ని పాటిస్తున్నామ‌ని, తద్వారా జట్టును బలంగా ముందుకు తీసుకెళ్లగలిగామని గంభీర్ చెప్పాడు. 'డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా పారదర్శకత ఉంది. ఇది చాలా నిజాయితీ గల డ్రెస్సింగ్ రూమ్.. మేము ఈ డ్రెస్సింగ్ రూమ్‌ను ఇలాగే ఉంచాలనుకుంటున్నాము.

2026 T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని గంభీర్.. జట్టు ఆ పనిలో నిమ‌గ్న‌మై ఉంద‌ని అన్నాడు.. అయితే జ‌ట్టుగా మాత్రం సరైన సమయంలో తిరిగి ఫామ్‌లోకి వస్తామ‌నే నమ్మకం వ్య‌క్తం చేశాడు. 'టి 20 ప్రపంచకప్ పరంగా మనం ఉండాల్సిన చోటికి చేరుకోలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఫిట్‌గా ఉండటం ప్రాముఖ్యత అని ఆశిస్తున్నాము. మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అక్కడికి చేరుకోవడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది అన్నాడు.

Next Story