'మా విషయంలో జోక్యం చేసుకోకు..' పాంటింగ్‌పై విరుచుకుపడ్డ గంభీర్..!
ముంబైలో విలేకరుల సమావేశంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌పై విరుచుకుపడ్డాడు
By Medi Samrat Published on 11 Nov 2024 2:05 PM ISTముంబైలో విలేకరుల సమావేశంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌పై విరుచుకుపడ్డాడు. గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మద్దతుగా నిలిచాడు. రికీ పాంటింగ్ తన జాతీయ జట్టుపై దృష్టి పెట్టడం, వారి గురించి ఆలోచించడం మంచిదని రికీకి ఘాటైన సమాధానం ఇచ్చాడు. రికీ పాంటింగ్‌పై గౌతమ్ గంభీర్ ఆగ్రహం చెందడానికి కారణం ఎంటో తెలుసుకుందాం..
రికీ పాంటింగ్ ఇటీవల విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ప్రశ్నలు లేవనెత్తాడు. ICC సమీక్ష గురించి మాట్లాడుతూ.. ఇటీవలే నేను విరాట్ గణాంకాలను చూశానని.. అందులో అతడు గత ఐదేళ్లలో కేవలం రెండు, మూడు టెస్టు సెంచరీలు మాత్రమే సాధించాడు.. ఇది నాకు సరైనది కాదు.. అది సరైనది అయితే.. ఆందోళన కలిగించే విషయం అని పాంటింగ్ చెప్పాడు.
రికీ పాంటింగ్ వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. పాంటింగ్‌కు భారత క్రికెట్‌కు ఏమి సంబంధం.? అతడు ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి నేను చింతించను అని స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చాడు. కోహ్లీ, రోహిత్ శర్మలకు మద్దతు ఇస్తూ.. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇద్దరూ ఇంకా కష్టపడి పనిచేయడం.. వారు ఇంకా చాలా సాధించాలనుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆకలి నాకు చాలా ముఖ్యం. వారు బలమైన ఆటగాళ్లు అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వ్ ఆటగాళ్లు : ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.