టార్గెట్‌ 2027 వరల్డ్‌కప్..శ్రీలంక కొత్త కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్

భారత జట్టుకు 2011 ప్రపంచ కప్ అందించిన మాజీ దిగ్గజ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టారు.

By -  Knakam Karthik
Published on : 9 March 2026 8:20 PM IST

Sports News, Cricket News, Gary Kirsten, SriLanka Cricket, WorldCup2027, CricketCoach

టార్గెట్‌ 2027 వరల్డ్‌కప్..శ్రీలంక కొత్త కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్

భారత జట్టుకు 2011 ప్రపంచ కప్ అందించిన మాజీ దిగ్గజ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టారు. సోమవారం శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఆయనను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 15 నుండి అమల్లోకి రానున్న ఈ ఒప్పందం ప్రకారం, కిర్‌స్టన్ రెండేళ్ల పాటు అంటే ఏప్రిల్ 14, 2028 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

ప్రధానంగా 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టును సన్నద్ధం చేయడం ఆయన ప్రధాన బాధ్యతగా ఉండనుంది. జాతీయ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచ స్థాయి ఈవెంట్‌లలో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

58 ఏళ్ల కిర్‌స్టన్‌కు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అనుభవం ఉంది. ఆయన నేతృత్వంలో భారత్ 2011 ప్రపంచ కప్‌ను గెలవడమే కాకుండా, ఆ తర్వాత ఆయన కోచింగ్‌లోనే దక్షిణాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్లలో నంబర్ 1 ర్యాంకును సాధించింది. ఇటీవల టీ20 ప్రపంచ కప్ సమయంలో నమీబియా జట్టుకు కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించిన కిర్‌స్టన్, ఇప్పుడు శ్రీలంక జట్టును మళ్లీ విజయపథంలోకి నడిపించేందుకు సిద్ధమయ్యారు.

Next Story