రోహిత్ తీసుకున్న నిర్ణ‌యం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.. మ‌రోసారి అలా చేయ‌డ‌ని బావిస్తున్నా

Gambhir slams decision to drop Pant against Pakistan.ఆసియా క‌ప్ 2022 టోర్న‌మెంట్‌ను టీమ్ఇండియా ఘ‌నంగా ఆరంభించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2022 3:04 PM IST
రోహిత్ తీసుకున్న నిర్ణ‌యం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.. మ‌రోసారి అలా చేయ‌డ‌ని బావిస్తున్నా

ఆసియా క‌ప్ 2022 టోర్న‌మెంట్‌ను టీమ్ఇండియా ఘ‌నంగా ఆరంభించింది. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠగా సాగిన మ్యాచులో పాకిస్తాన్‌పై భార‌త్ విజ‌యాన్ని అందుకుంది. హార్థిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, విరాట్ కోహ్లీ లు జ‌ట్టు విజ‌యంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్‌లో యువ ఆట‌గాడు రిష‌బ్ పంత్‌ను కాద‌ని సీనియ‌ర్ ఆట‌గాడు దినేశ్ కార్తిక్ కు జ‌ట్టు యాజ‌మాన్యం చోటు ఇచ్చింది. ప్ర‌స్తుతం దీనిపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. కొంద‌రు ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు.

దీనిపై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ స్పందించాడు. మ‌రో యాభై రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానున్న స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌యోగాలు జ‌ట్టుకు మంచివి కాద‌న్నాడు. ఆసియా క‌ప్ ముగిసిన త‌రువాత ప్ర‌పంచ క‌ప్ లోపు టీమ్ఇండియా ఓ ఐదు లేదా ఆరు టీ20 మ్యాచ్‌ల‌ను ఆడొచ్చు. అందుక‌నే ఈ లోపు తుది జ‌ట్టును ఎంపిక చేసుకోవాల‌ని, దానితో పాటే బ్యాక‌ప్‌ను సిద్దంగా ఉంచుకోవాలని అన్నాడు. ఇక పంత్‌ను తుది జ‌ట్టులోంచి తప్పించ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని తెలిపాడు.

మిడిలార్డ‌ర్‌లో ఓ లైఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్స్ ఖ‌చ్చితంగా ఉండాలి. జ‌ట్టులో ఇప్ప‌టికే చాలా మంది కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. పంత్ ఇటు ఓపెన‌ర్‌గా అటు మిడిలార్డ‌ర్‌లో ప‌నికొస్తాడు. పాక్‌తో మ్యాచ్‌లో తీసుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇది ఇలాగా ఎక్కువ కాలం కొన‌సాగ‌ద‌ని బావిస్తున్నా. దినేశ్ కార్తిక్, పంత్‌ల‌లో నా ఓటు ఖ‌చ్చితంగా పంత్‌కే అని గౌత‌మ్ గంభీర్ చెప్పాడు.

Next Story