కోహ్లీ ఓపెనింగ్ పై గుస్సా అయిన గంభీర్
Gambhir on talks of Kohli opening for India in T20Is. కోహ్లీ వరల్డ్ కప్ లో ఓపెనింగ్ లో రావాలని పలువురు కోరుతూ ఉండగా.. భారత మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్
By Medi Samrat Published on 18 Sept 2022 7:45 PM ISTకోహ్లీ వరల్డ్ కప్ లో ఓపెనింగ్ లో రావాలని పలువురు కోరుతూ ఉండగా.. భారత మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇవన్నీ పనికిమాలిన ఆలోచనలని గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. ఈ నాన్‌సెన్స్ మొదలు పెట్టకండి. కేఎల్ రాహుల్, రోహిత్ ఉండగా కోహ్లీ ఓపెనర్‌గా రావడం జరగదు. అసలు దీనిపై చర్చ జరగడమే వేస్ట్ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మూడో నెంబర్‌పై కూడా నా వరకు నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి. ఓపెనర్లు పది ఓవర్లు ఆడితే ఆ స్థానంలో సూర్యకుమార్‌ను దింపాలి. లేదంటే కోహ్లీనే మూడో నెంబర్‌లో రావాలని స్పష్టం చేశాడు.
అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు ముందు భారత్ సన్నాహాలు ప్రారంభమించింది. ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత్ తమ ముందు ఉన్న ఆప్షన్స్ ను పరీక్షించడానికి సిద్ధంగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు, ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ భారత్‌కు ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు కోహ్లి. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన తన సెంచరీని ఎట్టకేలకు అందుకున్నాడు. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ లేకపోవడంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ.. కేవలం 61 బంతుల్లో 122* పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తాజాగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "జట్టు కోసం పలు ఎంపికలు అందుబాటులో ఉండటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ప్రపంచ కప్‌కు వెళ్లడం చాలా ముఖ్యం. జట్టు ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడంలో ఆటగాళ్లు అత్యుత్తమ షేప్‌లో ఉండాలని కోరుకుంటారు. మేము ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు, అది జరగకపోతే సమస్య వస్తుంది'' అని మీడియాతో చెప్పాడు. "విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కు వచ్చే అవకాశం గురించి మేము ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకుంటాము. మేము మూడవ ఓపెనర్‌ని తీసుకోలేదు. కోహ్లీ తన ఫ్రాంచైజీ కోసం ఓపెనింగ్ చేస్తూ ఉంటాడు... కాబట్టి ఇది మాకు ఖచ్చితమైన ఎంపిక," అని రోహిత్ వివరించాడు.