యుద్ధాలనేవి డిజిటల్‌ ప్లేగ్రౌండ్‌లలో జరగాలి కానీ గ్రౌండ్‌లో కాదు

Fun88’s latest advertising campaign. అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫన్‌ 88, భారతీయ మార్కెట్‌లో తమ

By Medi Samrat  Published on  17 Oct 2022 11:30 AM GMT
యుద్ధాలనేవి డిజిటల్‌ ప్లేగ్రౌండ్‌లలో జరగాలి కానీ గ్రౌండ్‌లో కాదు

అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫన్‌ 88, భారతీయ మార్కెట్‌లో తమ కార్యకలాపాలను వృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెడుతుంది. నూతన వినియోగదారులను ఆకర్షించడంతో పాటుగా క్రీడలకు సంబంధించి ఏకీకృత కేంద్రంగా మారాలనే లక్ష్యంలో భాగంగా ఫన్‌ 88 ఇప్పుడు భాగస్వామ్యాలు, స్పాన్సర్‌షిప్‌లు , ప్రకటనలు, బ్రాండ్‌ క్యాంపెయిన్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. డారెన్‌ సామీ తో తమ ప్రస్తుత భాగస్వామ్యాలను బలోపేతం చేసుకునే దిశగా భారతదేశపు అభిమాన స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫన్‌ 88 తమ తాజా బ్రాండ్‌ ప్రచారాన్ని 'యుద్ధాలనేవి డిజిటల్‌ ప్లేగ్రౌండ్‌లలో జరగాలి కానీ గ్రౌండ్‌లో కాదు' అనే నేపథ్యంతో నిర్వహించింది. ఫన్‌ 88 తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా డారెన్‌ సామీతో జూలై 2021లో ఒప్పందం చేసుకుంది.

మూడు బ్రాండ్‌ చిత్రాలుగా విస్తరించిన ఫన్‌ 88 యొక్క ప్రచారంలో డారెన్‌ ను మూడు విభిన్న అవతారాలలో చూపుతారు. అక్కడ ఆయన యుద్ధాలను ఆపడంతో పాటుగా ఫన్‌ 88 యొక్క డిజిటల్‌ ప్లే గ్రౌండ్‌లో యుద్ధం చేయమని చెబుతారు. తన రెగ్యులర్‌ జెర్సీ లుక్‌కు బదులుగా డారెన్‌ ఓ చిత్రంలో ముకుట్‌ లేదంటే కిరీటం ధరించి కనబడతాడు. ఇంకో చిత్రంలో నటునిగా కనబడతారు. మూడవ చిత్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోడి పందాల నేపథ్యంలో కనబడతారు.

ఫన్‌ 88 యొక్క మార్కెటింగ్‌ కార్యక్రమాలను గురించి ఫన్‌ 88 అధికార ప్రతినిధి మాట్లాడుతూ ''భారతదేశం మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్‌. ఇక్కడ వినియోగదారులు క్రికెట్‌ను అమితంగా అభిమానించినప్పటికీ క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపుతుంటారు. అది దృష్టిలో పెట్టుకుని, మా ప్రచారాలను మా ప్రస్తుత, సంభావ్య వినియోగదారుల తో ప్రత్యక్షంగా కనెక్ట్‌ కావడానికి ఈ ప్రచారం తీర్చిదిద్దాము. ఈ మూడు బ్రాండ్‌ చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా వినూత్నంగా, సంబంధితంగా ఉంటాయి. డారెన్‌ సామీ మా బ్రాండ్‌ ముఖ చిత్రంగా ఈ ప్రాంతంలో ఫన్‌ 88 యొక్క బ్రాండ్‌ స్ధానాన్ని మరింత బలోపేతం చేయనున్నారు'' అని అన్నారు

ఫన్‌ 88 యొక్క ప్రచారం సోషల్‌ మీడియా, ఓటీటీ, వీఓడీ ప్లాట్‌ఫామ్స్‌ సహా డిజిటల్‌ మాధ్యమాలలో ప్రసారం కానుంది.


Next Story