సూపర్ స్టార్స్ అయినా.. కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు
From Suresh Raina to Imran Tahir, BIG NAMES who went unsold at auction. IPL 2022 మెగా వేలం ఫిబ్రవరి 13 (ఆదివారం) ముగిసింది. చాలా మంది క్రికెటర్లు
By Medi Samrat Published on 14 Feb 2022 12:21 PM ISTIPL 2022 మెగా వేలం ఫిబ్రవరి 13 (ఆదివారం) ముగిసింది. చాలా మంది క్రికెటర్లు కోటీశ్వరులుగా మారడం మనం చూశాము. అయితే కొందరు స్టార్స్ ను కనీసం కొనుక్కోడానికి ముందుకు రాలేదు. ఒకప్పుడు లీగ్ లో స్టార్లుగా వెలుగొందిన దేశ, విదేశీ ఆటగాళ్లను ఒక్క ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కు గతంలో అనేక విజయాలు అందించిన సురేశ్ రైనాను కొనుక్కోలేదు. ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన పవన్ నేగి, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా వంటి వాళ్లను కొనుక్కోడానికి ఎవరూ ముందుకు రాలేదు.
1. సురేష్ రైనా
చెన్నై సూపర్ కింగ్స్ కు ఎన్నో విజయాలకు కారకుడు అయ్యాడు. Mr IPL అని పిలిపించుకున్న రైనాను IPL 2022 మెగా వేలంలో, ఏ ఫ్రాంచైజీ కూడా కొనడానికి ముందుకు రాలేదు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి రైనా అమ్ముడుపోకుండా ఉన్నాడు. అతని బేస్ ధర రూ.2 కోట్లు కాగా.. మెగా వేలంలో షాకింగ్ నిర్ణయంలో ఇది ఒకటి.
2. ఇమ్రాన్ తాహిర్
42 ఏళ్ల వయసులో మెగా వేలంలో ఇమ్రాన్ తాహిర్ అత్యంత వయసైన ఆటగాడు. అతని సేవలు ఇక అవసరం లేదని ఫ్రాంచైజీలు భావిస్తున్నందున అతను కూడా అమ్ముడుపోలేదు. ఇమ్రాన్ కొన్ని సీజన్ల పాటు CSKలో ఉన్నాడు. అతని బేస్ ధర రూ.2 కోట్లు.
3. పుజారా
పుజారాను గత ఏడాది రూ. 50 లక్షల బేస్ ప్రైస్ కు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో ఏ ఫ్రాంచైజీ అతనిపై డబ్బు పెట్టలేదు. ఈ ఏడాది కూడా అతని బేస్ ధర అంతే అయినా.. కొనుక్కోడానికి ఎవరూ ముందుకు రాలేదు.
4. మార్నస్ లబుషేన్
మార్నస్ లబుషేన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్ కావచ్చు కానీ మార్నస్ లబుషేన్ కోసం, ఏ ఫ్రాంచైజీ తమ డబ్బును ఖర్చు చేయలేదు. అతను T20 బ్యాటర్‌లలో అంత స్టార్ కాకపోవడంతో అతని బేస్ ధర రూ. 1 కోటి ఉన్నా కూడా తీసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.
5. ఇయాన్ మోర్గాన్
ఇయాన్ మోర్గాన్ టీ20లో విధ్వంసకర ఆటగాడు. అతను IPL 2021లో కేకేఆర్ ని ఫైనల్‌కు నడిపించాడు. 2022లో అతను ఏ ఐపీఎల్ జట్టుకు ఆడడం లేదు. అతని బేస్ ధర రూ.1.5 కోట్లు.. ఇటీవలి కాలంలో బ్యాట్‌తో అతని పేలవ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు మోర్గాన్ ను కొనుక్కోడానికి ముందుకు రాలేదు.
6. ఆడమ్ జంపా
మెగా వేలం నుండి అతిపెద్ద షాక్‌లలో జంపా ను కొనకపోవడం కూడా ఒకటి. జంపా టాప్ T20 బౌలర్, మణికట్టు స్పిన్నర్, పలు లీగ్ లలో ఆడుతూ ఎల్లప్పుడూ డిమాండ్‌లో ఉంటాడు. అతడి బేస్ ధర రూ. 2 కోట్లు ఉన్నా.. జంపాను కొనుక్కోలేదు.
7. షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ అందించిన అత్యుత్తమ క్రికెటర్, ప్రపంచంలోనే బెస్ట్ ఆల్ రౌండర్ అయినా.. గత IPLలో ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో అతను అమ్ముడుపోలేదు. అతని బేస్ ధర రూ.2 కోట్లు.
8. స్టీవ్ స్మిత్
టీ20ల్లో స్టీవ్ స్మిత్ ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. దీంతో అతనిని ఫ్రాంచైజీలు తీసుకోలేదు. అతని బేస్ ధర రూ. 2 కోట్లు ఉన్నప్పటికీ స్టీవ్ స్మిత్ అమ్ముడుపోలేదు.