ఆ ఇంట్లో 15 రోజులు ఉన్నాను.. ఊటీకి కూడా తీసుకెళ్లాడు.. క్రికెట‌ర్‌పై మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యష్ దయాల్ పై కొత్త ఆరోపణలు చేసింది ఓ మహిళ.

By Medi Samrat
Published on : 30 Jun 2025 2:30 PM IST

ఆ ఇంట్లో 15 రోజులు ఉన్నాను.. ఊటీకి కూడా తీసుకెళ్లాడు.. క్రికెట‌ర్‌పై మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యష్ దయాల్ పై కొత్త ఆరోపణలు చేసింది ఓ మహిళ. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ పెళ్లి నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. ఇప్పుడు అతడిపై మరిన్ని ఆరోపణలు చేసింది. గతంలో దయాల్ భావోద్వేగ, మానసిక, శారీరక దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించిన ఆ మహిళ, ఇప్పుడు వారి నాలుగున్నర సంవత్సరాల కాలంలో అతనికి అనేక వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆరోపణలను కప్పిపుచ్చడానికి డబ్బు, ఫేమ్, అధికారాన్ని ఉపయోగించాడని ఆరోపించింది.

"యష్ దయాల్ ఇంట్లో 15 రోజులు ఉన్నాను. అతను నన్ను ఊటీకి ట్రిప్ కి కూడా తీసుకెళ్లాడు. నేను చాలాసార్లు అతని ఇంట్లో ఉన్నాను, అతని కుటుంబంతో సమయం గడిపాను. యష్ దయాల్, అతని కుటుంబం పలు హామీలు ఇవ్వడం ద్వారా ఆశలు పెంచుతూనే ఉన్నారు" అని బాధిత మహిళ ఆరోపించింది. "యష్ దయాల్ డబ్బుతో కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించాడు, కానీ నాకు చట్టంపై పూర్తి నమ్మకం ఉంది. యష్ దయాల్ కు నోటీసు పంపినట్లు పోలీసులు తెలిపారు" అని ఆ మహిళ చెప్పింది.

దయాల్ కు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తనకున్న సందేహాలు ఏప్రిల్ 17, 2025న మరొక మహిళ తనను సంప్రదించినప్పుడు ధృవీకరించుకున్నానని ఆ మహిళ పేర్కొంది. దయాల్ మోసం చేసిన‌ అనేక మంది మహిళలతో తాను మాట్లాడానని, ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె చెబుతోంది.

Next Story