విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్‌ అకాడమీకి శంకుస్థాపన

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు విశాఖపట్నంలో తన అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్మాణం కోసం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేశారు.

By అంజి  Published on  7 Nov 2024 5:58 AM GMT
Foundation laying, PV Sindhu Sports Academy, Visakhapatnam, APnews

విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్‌ అకాడమీకి శంకుస్థాపన

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు విశాఖపట్నంలో తన అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్మాణం కోసం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేశారు. చినగదిలిలోని ఆరిలోవాలో సుమారు మూడు ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిలో ఆమె అకాడమీ నిర్మిస్తున్నారు. ఏడాదిన్నరలో దీనిని పూర్తి చేస్తామని పీవీ సింధు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలింపిక్స్‌ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని చెప్పారు. బ్యాడ్మింటన్‌పై ఇంట్రెస్ట్‌ ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పీవీ సింధు అన్నారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

''విశాఖపట్నంలోని పీవీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది! ఇది కేవలం ఒక సౌకర్యం కాదు; ఇది భవిష్యత్తు-తరువాతి తరం ఛాంపియన్‌లను ఎలివేట్ చేయడానికి, భారతీయ క్రీడలలో అత్యుత్తమ స్ఫూర్తిని రగిలించడానికి ఒక సాహసోపేతమైన అడుగు. నా అద్భుతమైన బృందం, భాగస్వాముల యొక్క తిరుగులేని మద్దతుతో, మేము రాబోయే తరాలకు భారతీయ క్రీడల భవిష్యత్తును ప్రేరేపించే, శక్తివంతం చేసే, ఆకృతి చేసే వాటిని నిర్మిస్తున్నాము'' అని పీవీ సింధు ట్వీట్‌ చేశారు.

Next Story