మదనపల్లి కేసుతో ఎలాంటి సంబంధం లేదు : పెద్దిరెడ్డి

మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు.

By Medi Samrat  Published on  7 Aug 2024 8:15 PM IST
మదనపల్లి కేసుతో ఎలాంటి సంబంధం లేదు : పెద్దిరెడ్డి

మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని.. కావాలనే తమ పార్టీ నేతలని టార్గెట్ చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రతి విషయానికి రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాంతో కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని.. రికార్డులు కాలిపోయాయని డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకమేనని.. మదనపల్లెలో రికార్డులు తగలపడితే మాపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని.. తప్పుడు ఆరోపణలు చేసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు.

కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు.

Next Story