Former India cricketer Yashpal Sharma dies of heart attack. భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు
By Medi Samrat Published on 13 July 2021 7:19 AM GMT
భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. 1983 ప్రపంచకప్‌లో భారత జట్టు సభ్యుడిగా యశ్‌పాల్ శర్మ ఉన్నారు. ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్‌లో 61 పరుగులతో కీలకపాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
యశ్‌పాల్ శర్మ 66 సంవత్సరాల వయసులో మరణించారు. మంగళవారం తీవ్ర గుండెపోటుతో మరణించారు. భారత మాజీ బ్యాట్స్‌మన్ ఉదయం 7:40 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఆయనకు భార్య రేణు శర్మ, ఇద్దరు కుమార్తెలు పూజ, ప్రీతి, కుమారుడు చిరాగ్ శర్మ ఉన్నారు.
ఆగష్టు 11, 1954 న లూధియానాలో జన్మించిన పంజాబ్ క్రికెటర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. భారత్ 1983 ప్రపంచ కప్ విజేతగా నిలవడంలో ఆయనది కీలక పాత్ర. అతను 89 పరుగుల మ్యాచ్-విన్నింగ్ నాక్ ఇప్పటికీ ఎవరూ మరచిపోరు. వెస్టిండీస్ జట్టును ఫైనల్ లో మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో యష్‌పాల్ 61 పరుగులతో రాణించాడు. బాబ్ విల్లిస్ యార్కర్ ను సిక్సర్ గా స్క్వేర్ లెగ్ లో కొట్టడం ఎవరూ మరచిపోరు. యష్పాల్ పాత్రను నటుడు జతిన్ శర్మ రాబోయే చిత్రం '83' లో పోషించునున్నారు. 1983 ప్రపంచ కప్ మీద వస్తున్న సినిమా.