14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్
FIR against Pakistan spinner Yasir Shah for aiding in alleged rape of minor girl. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పాకిస్తాన్
By - Medi Samrat |
14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పాకిస్తాన్ క్రికెటర్ యాసిర్ షా పేరు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాలికను కిడ్నాప్, వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై పాకిస్థాన్ టెస్టు లెగ్ స్పిన్నర్ యాసిర్ షా, అతని స్నేహితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో లాహోర్‌లోని షాలిమార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెటర్ ఇంకా స్పందించలేదు.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. యాసిర్ స్నేహితుడు ఫర్హాన్ తుపాకీతో తనను కిడ్నాప్ చేసి, తనపై అత్యాచారం చేసి.. వీడియోలు తీసి ఆ తరువాత బెదిరింపులకు పాల్పడ్డాడని బాలిక ఆరోపించింది. యాసిర్ షా తన స్నేహితుడికి సహాయం చేశాడని ఆరోపించింది. ఆ తర్వాత ఫర్హాన్‌తో కలసి యాసిర్ షా.. తాను గొంతు ఎత్తితే తన వీడియోలను బయటపెడతానని బెదిరించాడని బాలిక ఆరోపించింది. సాయం కోసం యాసిర్‌ను వాట్సాప్‌లో సంప్రదించినప్పుడు.. అతను తనను చూసి నవ్వాడని.. జరిగిన ఘటనపై నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. నేను పోలీసులను ఆశ్రయించినప్పుడు.. తాను మౌనంగా ఉంటే.. 18 ఏళ్ల పాటు ఫ్లాట్, నెలవారీ ఖర్చులు ఇస్తానని యాసిర్ ఆఫర్ ఇచ్చాడని బాలిక పేర్కొంది.
ఇదిలావుంటే.. వేలికి గాయం కావడంతో యాసిర్ ఇటీవలి టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లలేదు. అయితే.. ESPNCricinfoలో ఒక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఈ విషయమై స్పందిస్తూ.. కాంట్రాక్ట్ ఆటగాడు ఒకరిపై కొన్ని ఆరోపణలు వచ్చినట్లు మేము గుర్తించాము. ఈ విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నాం. వివరాలు వచ్చాక మట్లాడుతామని పేర్కొంది.