19 సిక్స‌ర్లు.. మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ విధ్వంసం..!

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ప్రారంభ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ కేవలం 34 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు.

By Medi Samrat
Published on : 13 Jun 2025 9:21 AM IST

19 సిక్స‌ర్లు..  మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ విధ్వంసం..!

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ప్రారంభ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ కేవలం 34 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. అత‌డి ఇన్నింగ్సులో 19 సిక్స‌ర్లు ఉండ‌టం విశేషం. మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచ‌రీ. తొలి మ్యాచ్ శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌గా.. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 269 ప‌రుగులు చేసింది.

ఫిన్ అలెన్ విష‌యానికొస్తే.. మేజర్ లీగ్ క్రికెట్ నికోలస్ పూరన్ మునుపటి రికార్డైను(40-బంతుల్లో సెంచరీ) బద్దలు కొట్టాడు. టిమ్ సీఫెర్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఫిన్ అలెన్ ఇష్టానుసారంగా బౌండరీలు బాదాడు. అలెన్ 51 బంతుల్లో 151 పరుగులు చేసి మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 19 సిక్సర్లు ఉన్నాయి. అలెన్ క్రీజులో ఉన్నంత‌సేపు బంతిని మైదానం నలుమూలలకు బాది ప్రత్యర్థి బౌలర్లను, ఫీల్డ‌ర్ల‌ను నిస్సహాయంగా ఉంచాడు. అలెన్ అవుట‌య్యాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే.. ఫిన్ అలెన్ 19 సిక్సర్లతో క్రిస్ గేల్, సాహిల్ చౌహాన్ (18 సిక్సర్లు) పేరిట ఉన్న రికార్డు కూడా బద్దలు కొట్టాడు.

Next Story