వినేష్‌కు పతకం వస్తుందా.? లేదా.? ఈ రాత్రే తేల‌నుంది..!

పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి అనర్హత వేటు పడిన వినేష్‌ ఫోగట్‌కు పతకం వస్తుందా లేదా అనేది ఈ రాత్రికి తేలనుంది.

By Medi Samrat
Published on : 10 Aug 2024 3:31 PM IST

వినేష్‌కు పతకం వస్తుందా.? లేదా.? ఈ రాత్రే తేల‌నుంది..!

పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి అనర్హత వేటు పడిన వినేష్‌ ఫోగట్‌కు పతకం వస్తుందా లేదా అనేది ఈ రాత్రికి తేలనుంది. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పోటీలో 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేష్ ఫోగట్.. 100 గ్రాములు బ‌రువు ఎక్కువగా ఉండ‌టంతో అనర్హత వేటుపడింది. వినేష్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దానిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో పిటీష‌న్‌ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు రాత్రి 9.30 గంటలకు నిర్ణయం తీసుకోనున్నారు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో వినేష్ ఫోగట్ కేసుపై పోరాడేందుకు IOA మాజీ సొలిసిటర్ జనరల్, సీనియర్ న్యాయవాది సాల్వేను నియమించింది. హరీష్ సాల్వే కేసు గెలిచి.. వినేష్ పతకం సాధించాలని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Next Story