17వ ఐపీఎల్ సీజ‌న్‌ కూడా ఆర్సీబీకే ఆడ‌నున్న కోహ్లీ.. 11 మందికి ఉద్వాస‌న..!

ఐపీఎల్‌-2024 వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టును ప్రకటించింది.

By Medi Samrat  Published on  26 Nov 2023 7:15 PM IST
17వ ఐపీఎల్ సీజ‌న్‌ కూడా ఆర్సీబీకే ఆడ‌నున్న కోహ్లీ.. 11 మందికి ఉద్వాస‌న..!

ఐపీఎల్‌-2024 వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి తన 17వ ఐపీఎల్ ఆడనున్నాడు. ఈసారి బెంగళూరు 11 మంది ఆటగాళ్లను వ‌దులుకుంది. అయితే.. బెంగళూరు తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ఈ 11 మంది ఆటగాళ్లలో.. కొంత‌మంది స్టార్ ఆట‌గాళ్లు ఉన్నప్పటికీ వారికి ఉద్వాస‌న ప‌లికింది.

ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఆర్సీబీ తుది జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లను ఆర్సీబీ మరోసారి అట్టిపెట్టుకుంది. వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్‌ ఆటగాళ్లను విడుదల చేసింది. హసరంగా, హర్షల్ పటేల్ ఆర్సీబీ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లుగా నిరూపించుకున్నారు.

ఆర్సీబీ వ‌దులుకున్న ఆట‌గాళ్ల జాబితా : హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, పార్నెల్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్ మరియు కేదార్ జాదవ్.

17వ ఐపీఎల్ ఆడనున్న కోహ్లీ.. ముగ్గురు స్టార్ ప్లేయ‌ర్స్ స‌హా 11 మందిని వ‌దులుకున్న ఆర్సీబీ..!విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్, విల్ జాక్వెస్, మహిపాల్ లామర్, కరణ్ శర్మ, మనోజ్ బంగ్డే, మయాంక్ దాగర్, ఆకాశ్ దీప్, విజయ్ కుమార్, సిరాజ్, రీష్ టోప్లీ, హిమాన్షు, రాజన్.

Next Story