ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్‌లో వీరోచిత ప్రదర్శనకు గాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. సిరాజ్ తో పాటు ఐర్లాండ్ కు చెందిన ఓర్లా ప్రెండర్ గాస్ట్ కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ చివరి రోజున సిరాజ్ చేసిన అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కారణంగా భారతదేశం ది ఓవల్ టెస్ట్ మ్యాచ్ ను ఆరు పరుగుల తేడాతో గెలవడానికి సహాయపడింది. ఐదవ మ్యాచ్ నాటకీయంగా ముగిసిన చివరి రోజు ఉదయం సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత జట్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది.