అర్జున్ టెండుల్కర్ ఉత్సాహాన్ని హత్య చేయకండి
Farhan Akhtar on Arjun Tendulkar bring trolled for nepotism. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్
By Medi Samrat
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ను ఐపీఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అర్జున్ ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా, ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో చివరికి అదే ధర వద్ద ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. అర్జున్ టెండుల్కర్ లో ట్యాలెంట్ లేదని.. కేవలం తండ్రి పేరు మీదనే అవకాశం దక్కిందని పలువురు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలపై పలువురు ప్రముఖులు తప్పుబడుతూ ఉన్నారు. ఇలాంటి విమర్శల వలన ఎంతో భవిష్యత్తు ఉన్న అర్జున్ పై పడుతుందని చెబుతున్నారు.
తాజాగా అర్జున్ టెండుల్కర్‌కు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ అండగా నిలిచాడు. ఆట పట్ల అర్జున్‌కు అమిత శ్రద్ధ ఉందని, అతడి ఉత్సుకతను హత్య చేయవద్దంటూ హితవు పలికారు. నెపోటిజం పేరిట తనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు. అర్జున్ టెండుల్కర్ గురించి ఒక విషయం చెప్పదలచుకున్నాను. మేమిద్దరం ఒకే జిమ్‌లో తరచుగా కలుస్తూ ఉంటాం. ఫిట్‌నెస్ సాధించేందుకు అతడు ఎంతో కఠినంగా శ్రమిస్తాడు. మంచి క్రికెటర్‌గా ఎదిగే అంశాలపై దృష్టి పెడతాడు. కానీ వాటన్నింటినీ నెపోటిజం అనే ఒకే ఒక్క మాటతో నీరుగార్చడం సరికాదని ఫర్హాన్ అక్తర్ చెప్పుకొచ్చారు. అంతకంటే క్రూరమైంది మరొకటి లేదు. అతడి ఉత్సాహాన్ని మర్డర్ చేయకండి. సరికొత్త ప్రయాణానికి ముందే తనపై విమర్శల భారం మోపకండని ట్విటర్ వేదికగా తెలిపారు.
ఈ కామెంట్లపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే ముంబై జట్టులోకి అర్జున్ ప్రవేశించాడని.. క్రికెట్ గురించి మరింత నేర్చుకునేందుకు అర్జున్ కు ముంబై ఇండియన్స్ ఉపయోగపడుతుందని జయవర్ధనే చెప్పుకొచ్చాడు. అర్జున్ గొప్ప ఆటగాడిగా తయారవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. సచిన్ కుమారుడు అనే పెద్ద ట్యాగ్ అర్జున్ కు ఉందని... కానీ, అదృష్టం కొద్దీ అతను బౌలర్ అని, బ్యాట్స్ మెన్ కాదని జయవర్ధనే తెలిపాడు.
అర్జున్ ఇప్పుడిప్పుడే ముంబైకి ఆడుతున్నాడని.. ఇప్పుడు ముంబై ఫ్రాంచైజీకి ఆడుతాడని..అర్జున్ పై ఎక్కువ ఒత్తిడి ఉంచరాదని, అతనికి సమయం ఇవ్వాలని అంటున్నాడు జయవర్ధనే. అర్జున్ గురించి ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ, అతనితో నెట్స్ లో తాను చాలా సమయాన్ని గడిపానని, కొన్ని ట్రిక్స్ నేర్పానని చెప్పాడు. అర్జున్ ది కష్టపడే మనస్తత్వమని అన్నాడు. నేర్చుకోవాలనే తపన అర్జున్ లో ఉందని అన్నాడు. సచిన్ కుమారుడు అనే ఒత్తిడి మాత్రం అర్జున్ పై ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు.