ఏమాత్రం అంచ‌నాలు లేకుండా బ‌రిలో దిగి.. ప్లేఆఫ్స్‌ వ‌ర‌కూ..

Ex-players Congratulate Gujarat Titans On Reaching IPL 2022 Playoffs. ఐపీఎల్-2022 టోర్నమెంట్‌లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  11 May 2022 12:30 PM GMT
ఏమాత్రం అంచ‌నాలు లేకుండా బ‌రిలో దిగి.. ప్లేఆఫ్స్‌ వ‌ర‌కూ..

ఐపీఎల్-2022 టోర్నమెంట్‌లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. 15వ సీజన్‌లో ప్లేఆఫ్ బెర్త్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది. మంగళవారం పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2022లో 57వ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు లక్నో సూపర్ జెయింట్‌ను 62 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. గుజరాత్ ఖాతాలో ప్ర‌స్తుతం 18 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు సెల‌బ్రేష‌న్స్‌లో మునిగితేలుతున్నారు.

ప్లేఆఫ్ కాలింగ్ అని వ్రాసిన శుభమాన్ గిల్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నాడు.

మహ్మద్ షమీ కూడా ఓ ఫోటోను పంచుకున్నాడు. స‌మిష్టిగా రాణించామ‌న్నాడు. ఆటగాళ్లందరికీ, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపాడు.

లక్నో సూపర్ జెయింట్స్‌కి కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. లక్నో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అయితే రెండు మ్యాచ్‌లు ఓడిపోతే కూడా ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 16 పాయింట్లు సాధించిన జట్టు బహుశా ప్లేఆఫ్ లిస్ట్‌లో ఉంటుంది. ఇదిలావుంటే.. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా బ‌రిలో దిగి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించ‌డంతో జ‌ట్టుపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీని కొనియాడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా 5, మాథ్యూ వేడ్ 10, హార్దిక్ పాండ్యా 11, డేవిడ్ మిల్లర్ 26, శుభ్‌మన్ గిల్ 63, రాహుల్ తెవాటియా 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు తీయగా, జాసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్ చెరో వికెట్ తీశారు.


Next Story
Share it